Advertisementt

RX 100 తర్వాత బోల్డ్‌గా చేయనందిగా.. ఇదేంటి?

Sat 31st Aug 2019 03:23 PM
payal rajput,bold content,rx 100,rdx love movie,heroine  RX 100 తర్వాత బోల్డ్‌గా చేయనందిగా.. ఇదేంటి?
Satires on RX 100 Beauty Payal Rajput RX 100 తర్వాత బోల్డ్‌గా చేయనందిగా.. ఇదేంటి?
Advertisement
Ads by CJ

RX 100 సినిమాతో టాప్ లిస్ట్ లోకి చేరుతుంది అనుకున్న పాయల్ రాజపుత్ కి అనుకున్నంతగా అవకాశాలేమి రాలేదు. RX 100 లో బోల్డ్ గా నెగెటివ్ పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న పాయల్ టాలీవుడ్ లో సెటిల్ అవుతుందనే అనుకున్నారు. అలాగే కుర్ర హీరోలకన్నా సీనియర్ హీరోల సినిమాల్లో పాయల్ కి అవకాశాలొస్తున్నాయని ప్రచారం జరిగింది. అయితే సీనియర్ హీరో వెంకటేష్ పక్కన వెంకీమామ లో అవకాశం వచ్చినా... పాయల్ కి ఎక్కువగా RX 100 లాంటి పాత్రలే వచ్చాయట. కానీ RX100 లో చేసిన ఇందులాంటి పాత్రలే చేస్తూ పొతే.. తన మీద అదే బోల్డ్ ముద్ర పడుతుందని.. అలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న కథలను ఒప్పుకోలేదని ఒకానొక సమయంలో పాయల్ చెప్పింది.

మరి పాయల్ చెప్పినదానికి ఆమె చేస్తున్న దానికి ఎక్కడా పొంతనే కనబడడం లేదు. ఎందుకంటే తాజాగా పాయల్ రాజపుత్ నటించిన RDX లవ్ సినిమా టీజర్ చూస్తుంటే పాయల్ కి అలాంటి బోల్డ్ కేరెక్టర్స్ మాత్రమే వస్తాయనిపిస్తుంది. మొదటినుండి RDX పోస్టర్స్ లో అదిరిపోయే గ్లామర్ తో అందాలను ఆరబోస్తూ కవ్విస్తూన్న పాయల్ రాజపుత్ తాజాగా విడుదలైన RDX లవ్ టీజర్ లో మరింతగా రెచ్చిపోయింది. హీరో తేజస్ తో కలిసి పాయల్ RDX లవ్ లో రెచ్చిపోయి.. అందాలు ఆరబోయడమే కాదు.. అలాగే వల్గర్ డైలాగ్స్ తో రెచ్చిపోయింది. మరి ఎంతగా అందాలు చూపించాలో అంతగా చూపిస్తూ యూత్ మొత్తాన్ని తన వెంటపడేలా చేసుకుంటున్న పాయల్.. మొదట్లో చెప్పిన దానికి ఇప్పుడు చేస్తున్నదానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలో నటిస్తే... అవే పాత్రలొస్తున్నాయని కామ్ అయిన పాయల్ ఈ సినిమా ఎందుకు చేసిందో ఆమెకే తెలియాలి. 

Satires on RX 100 Beauty Payal Rajput:

Payal Rajput acted RDX love Teaser Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ