Advertisementt

నయనతార మళ్లీ వార్తల్లోకి..!!

Sun 01st Sep 2019 02:27 PM
nayanthara,vijay,bigil,remuneration,nayan,kollywood  నయనతార మళ్లీ వార్తల్లోకి..!!
Shocking Remuneration to Nayanthara నయనతార మళ్లీ వార్తల్లోకి..!!
Advertisement
Ads by CJ

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతారకు వయసు పెరుగుతున్న కొద్దీ అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి. ఒకవైపు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటించి తిరుగులేని ఇమేజ్ సంపాదించింది. సౌత్‌ని ఒక ఊపు ఊపేస్తున్న నయన్ ఈ కాలంలో అత్యధికంగా ఆదాయం పొందిన కథానాయిక కూడా ఆమే అయ్యుంటుందేమో. రీసెంట్ గా ఈమె ఒక సినిమా కోసం ఇండియాలో ఏ హీరోయిన్ తీసుకొని రెమ్యూనరేషన్ తీసుకుంది.

ప్రస్తుతం ఈమె తమిళ స్టార్ హీరో విజయ్‌తో ‘బిగిల్’ అనే సినిమాలో నటిస్తుంది. ఈమూవీ కోసం ఆమె ఏకంగా రూ.5 కోట్ల పారితోషకం పుచ్చుకుందట. ఇప్పటివరకు ఇండియాలో ఏ హీరోయిన్ ఇంత అందుకోలేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా పిలవబడే దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి వాళ్లు రూ.4 కోట్ల వరకు వచ్చారంతే. కానీ నయన్ మాత్రం 5 వరకు వెళ్ళింది. బాలీవుడ్ హీరోయిన్స్ కి దేశం మొత్తం మార్కెట్ ఉంది కాబట్టి అంత తీసుకున్న ఓకే కానీ నయన్ కేవలం సౌత్ వరకే పరిమితం. అయినా కానీ ఎక్కడా తగ్గడంలేదు.

ఇక ‘బిగిల్’కు దాదాపు రూ.200 కోట్ల దాకా బిజినెస్ అయ్యే అవకాశాలున్నాయి. నయన్ వల్ల ఈమూవీ కి ఇంకా మార్కెట్ పెరగొచ్చు. ఇక హీరో విజయ్ కూడా ఏమి తక్కువ కాదు ఈమూవీ కోసం విజయ్ రూ.30 కోట్లకు పైనే పుచ్చుకుంటున్నట్లు సమాచారం.

Shocking Remuneration to Nayanthara:

Nayanthara Takes 5 crores for Vijay Movie 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ