Advertisementt

శ్రద్దా ఆశలపై నీళ్లు చల్లిన.. ‘సాహో’!

Mon 02nd Sep 2019 03:56 PM
saaho,shraddha kapoor,prabhas,bollywood media,targets  శ్రద్దా ఆశలపై నీళ్లు చల్లిన.. ‘సాహో’!
Shraddha Kapoor Disappointed with Saaho Result శ్రద్దా ఆశలపై నీళ్లు చల్లిన.. ‘సాహో’!
Advertisement
Ads by CJ

నిన్నటివరకు ఉన్న సాహో ప్రభంజనం.. ఒక్కసారిగా తుస్ మంది. రెండేళ్ల నిరీక్షణతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సాహో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రభాస్ తన నటనతో సినిమాకి ప్లస్ పాయింట్ అయినా.. సినిమాలో కథ, కథనం, స్లో నేరేషన్, పాటలు లాంటి మైనస్ లతో నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఈ సినిమా కోసం హీరోయిన్ శ్రద్దాకపూర్ రెండేళ్లు తక్కువ పారితోషకాన్ని తీసుకుని చాలా కష్టపడింది. సాహోలో అశోక్ (ప్రభాస్) తో కలిసి ట్రావెల్ చేసే అమృతా నాయర్ అనే పోలీస్ అధికారిని పాత్ర చేసింది శ్రద్దా కపూర్. అమృతా నాయర్ ఎంట్రీ దగ్గరనుండి.. ఎంతో పవర్ ఫుల్ గా ఉండాల్సిన పాత్రని... హీరో ప్రేమ కోసం పరితపించి తన మోరల్స్ ను మర్చిపోయేంత వీక్ గా దర్శకుడు డిజైన్ చేసి ఉసూరుమనిపించాడు.

పాపం సాహో మీద నమ్మకం పెట్టుకుని.. బాలీవుడ్ లో తనకొచ్చిన అవకాశాలు శ్రద్ద రిజెక్ట్ చేసింది. కానీ సాహో టాక్ తో శ్రద్దా కపూర్ పెట్టుకున్న నమ్మకం కాస్తా పోయింది. సాహో తో సౌత్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇద్దామనుకుంది.. కానీ సాహో శ్రద్ద ఆశల మీద నీళ్లు చల్లింది. నటనలో శ్రద్దా కపూర్ బాగానే నటించింది. కానీ పాత్రలోని వీక్నెస్ తో ఆమె తేలిపోయింది. సాహో కోసం బల్క్ డేట్స్ ఇచ్చి లాక్ అయ్యి... బోలెడు బాలీవుడ్ బడా ప్రాజెక్టులు కాలదన్నుకున్న శ్రద్ద కు జరగాల్సిందే జరిగింది అంటూ బాలీవుడ్ మీడియా కూతలు కూస్తుంది.

Shraddha Kapoor Disappointed with Saaho Result:

Bollywood Media Targets Shraddha Kapoor Role in Saaho

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ