బాహుబలి తరవాత బాలీవుడ్ లో ఏ తెలుగు సినిమా రీమేక్ అయినా.. ఏ తెలుగు సినిమా బాలీవుడ్ లో విడుదలైనా.. అక్కడ స్టార్ హీరోలకు, క్రిటిక్స్ కి అస్సలు ఇష్టం ఉండడం లేదు. అందుకే తెలుగు సినిమాలేమన్నా విడుదలై బాలీవుడ్ లో హిట్ అయితే చాలు వాటి మీద పడి ఏడవడం ఈమధ్యన తరుచూ చూస్తూనే ఉన్నాం. అందుకు ఉదాహరణలు బాహుబలి హిట్ తర్వాత అక్కడి స్టార్ హీరోల గొంతులో పచ్చి వెలక్కాయ పడడం, అలాగే అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమా హిట్ అయితే..ఆ సినిమాని ఎలాగైనా ఆపాలని చూడడం వంటి విషయాలు చూసాం.
ఇక ప్రభాస్ తాజా చిత్రం సాహో ట్రైలర్ విడుదలయ్యాక బాలీవుడ్ క్రిటిక్స్‌కి, హీరోలకు కూడా కాస్త టెన్షన్ పట్టుకుంది. బాహుబలిలా సాహో కూడా ఎక్కడ ప్రభంజనం సృష్టించి తమ భారీ కలెక్షన్స్ దాటేస్తుందో అని. అందుకే సాహో సినిమాకి వీలైనంత తక్కువగా పబ్లిసిటీ చూపించారు. బాలీవుడ్ మీడియాతో పాటుగా క్రిటిక్స్ అంతా సాహో సినిమాకి హిట్ టాకొచ్చినా తొక్కెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు. కానీ సాహో నిజంగానే హిట్ టాక్ పడకుండా బాలీవుడ్ ఎలా అనుకుందో అలానే ప్లాప్ టాక్ తెచ్చుతుంది. దానితో సాహో సినిమా విషయంలో ముందు నుండి అనుకున్నట్టుగా తక్కువ రేటింగ్స్, సినిమా విషయంలో బాగా నెగెటివ్ టాక్ ని ప్రచారం చేస్తున్నారు. మరి బాలీవుడ్ పూజలు ఫలించి.. సాహో సినిమాపోయిందంటున్నారు.