Advertisementt

‘రాజావారు రాణిగారు’.. RX100 గుర్తొచ్చిందట!

Wed 04th Sep 2019 04:04 PM
adivi sesh,karthikeya,rajavaru ranigaru,song,amb mall  ‘రాజావారు రాణిగారు’.. RX100 గుర్తొచ్చిందట!
Rajavaru RaniGaru Team At AMB Mall ‘రాజావారు రాణిగారు’.. RX100 గుర్తొచ్చిందట!
Advertisement
Ads by CJ

ఏ.యమ్.బీ మాల్‌లో సందడి చేసిన ‘రాజావారు రాణిగారు’  

రేడియో సిటీ వారి ఆధ్వర్యంలో జరిగిన సూపర్ సింగర్ - సీజన్ 11 గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి రాజావారు రాణిగారు చిత్ర బృందం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నటులు అడివిశేష్, కార్తికేయ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. రాజావారు రాణిగారు చిత్రంలోని మూడవ పాటని విడుదల చేసి చిత్ర బృందానికి తమ అభినందలు తెలిపారు.

అడివిశేష్ మాట్లాడుతూ.. ‘‘టీజర్ చాలా బావుంది. సినిమాకి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్లే అని విన్నాను. సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

‘‘ఒక కొత్త మూవీ టీజర్‌కి రెస్పాన్స్ బాగా వస్తే అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. మా ఆర్.ఎక్స్. 100 టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్ నాకింకా గుర్తుంది. మిమ్మల్ని చూస్తుంటే అప్పట్లో మమ్మల్ని మేం చూసుకున్నట్టుంది. ఇలాగే కష్టపడితే ప్రేక్షకులు తప్పకుండా మిమ్మల్ని ఆదరిస్తారు’’ అంటూ హీరో కార్తికేయ చిత్ర బృందాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు.

Rajavaru RaniGaru Team At AMB Mall:

Adivi Sesh and Karthikeya Launches RajaVaru Ranigaru song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ