Advertisementt

బ్యాచిలర్ పార్టీ ట్రైలర్ వదిలారు

Thu 05th Sep 2019 03:31 PM
bachelor party,trailer release,bachelor party movie details  బ్యాచిలర్ పార్టీ ట్రైలర్ వదిలారు
Bachelor Party Movie Details బ్యాచిలర్ పార్టీ ట్రైలర్ వదిలారు
Advertisement
Ads by CJ

అనన్య ప్రజంట్స్ పతాకం పై భూపాల్, అరుణ్, ప్రియాంక, సంజన హీరో హీరోయిన్లుగా  D రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాచిలర్ పార్టీ. వినాయకచవితి సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్ర యూనిట్ లాంచ్ చేసారు . 

ఈ సందర్భంగా దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ.. ఇది ఒక యాక్షన్ వెరైటీ చిత్రం. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ హంగులు ఉంటాయి. మా ప్రొడ్యూసర్స్ సుబ్బారావు, శ్రీనివాస్ గార్లు చక్కటి సహకారం అందించారు. మా ఆర్టిస్టులు భూపాల్, అరుణ్, రమణారెడ్డి చక్కగా యాక్ట్ చేసారు. ఈ చిత్రాన్ని నవంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం..’’ అని అన్నారు.

హీరో అరుణ్ కురిటి మాట్లాడుతూ.. ఇది నా మొదటి చిత్రం. డైరెక్టర్ గారి సహకారంతో చాలా చక్కగా నటించాను. అలాగే భూపాల్, రమణారెడ్డి  నా కో ఆర్టిస్టులుగా చక్కని సహకారం అందించారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను..  అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో జబర్ధస్త్ నవీన్, రైటర్ మాణిక్యాలరావు కారేపల్లి తదితరులు పాల్గొన్నారు.

Bachelor Party Movie Details :

Bachelor Party Movie trailer Launched

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ