Advertisementt

మూడు భారీ సినిమాల్లో చాన్స్ కొట్టేసిన షాలినీ!

Sun 08th Sep 2019 08:17 PM
arjun reddy actress,shalini pandey,bollywood movies,lucky chances  మూడు భారీ సినిమాల్లో చాన్స్ కొట్టేసిన షాలినీ!
News About Arjun Reddy Actress Shalini Pandey మూడు భారీ సినిమాల్లో చాన్స్ కొట్టేసిన షాలినీ!
Advertisement
Ads by CJ

‘షాలినీ పాండే’ని టాలీవుడ్ సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యూత్‌కు ఈ ముద్దుగుమ్మ గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే దాదాపు అందరూ ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసే ఉంటారు గనుక. ఈ మూవీ చూసిన సినీ ప్రియులకు షాలిని ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘అర్జున్ రెడ్డి’లో హాట్ హాట్‌గా అందాలు ఆరబోసిన తర్వాత పెద్దగా టాలీవుడ్‌లో అవకాశాలు రాలేదు. అంతేకాదు.. ఈ ముద్దుగుమ్మ పని ఇంతటితో అయిపోయిందని అందరూ భావించారు. అయితే ఇన్ని రోజులు చాన్స్‌ల కోసం వేచి చూసిన ఈ ముద్దుగుమ్మకు మూడు భారీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిందట.

అయితే ఒక్కసారిగా నక్కతోక తొక్కినట్లుగా ఈ ముద్దుగుమ్మ ఒకట్రెండు కాదు ఏకంగా మూడు సినిమాల్లో.. అది కూడా బాలీవుడ్‌లో నటించే అవకాశం రావడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో 3 భారీ సినిమాల్లో చేయడానికి డీల్ కుదుర్చుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ మూడింటిలో ఒకటి రణ్‌వీర్ సింగ్‌తో సినిమా ఉందట. మొత్తానికి చూస్తే ఇన్ని రోజులు వేచి చూసినప్పటికీ ఈ భామ మాత్రం లక్కీ చాన్స్ కొట్టేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూడు సినిమాలు షాలినీ పాండే దశ తిరుగడం ఖాయమని.. స్టార్ హీరోయిన్‌గా ఎక్కడికో ఎదిగిపోతుందని అనే నడుస్తోంది. మరి ఏ మాత్రం సక్సెస్ అవుతుందో..? అసలు ఈ మూడు సినిమాల్లో చాన్స్ వచ్చినట్లు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

News About Arjun Reddy Actress Shalini Pandey :

News About Arjun Reddy Actress Shalini Pandey   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ