Advertisementt

వైసీపీ ఎమ్మెల్యేపై హీరో నాని ప్రశంసలు!

Mon 09th Sep 2019 01:48 PM
hero nani,comments,ysrcp mla,gang leader  వైసీపీ ఎమ్మెల్యేపై హీరో నాని ప్రశంసలు!
Hero Nani Comments about Ysrcp MLA వైసీపీ ఎమ్మెల్యేపై హీరో నాని ప్రశంసలు!
Advertisement
Ads by CJ

అవును మీరు వింటున్నది నిజమే.. నేచురల్ స్టార్ నాని.. వైసీపీ ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు.. తిరుమల వేదికగా మీడియాతో మాట్లాడుతూ నాని పొగిడారు. ఇంతకీ అసలు విషయమేంటో చూద్దాం. నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా సెప్టెంబర్-13న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తిరుమల వెంకన్నను ‘గ్యాంగ్ లీడర్’ చిత్రబృందం దర్శించుకుంది.

అయితే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డే.. నానికి దర్శనం, వెల్‌కమ్ అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. దీంతో అంతా చెవిరెడ్డి అన్నవల్లే చాలా బాగా దర్శనం జరిగిందని ప్రశంసల జల్లు కురిపించారు నాని. తిరుమల నుంచి చాలా పాజిటివ్ ఎనర్జీతో హైదరాబాద్ తిరిగివెళ్తున్నామని నాని చెప్పుకొచ్చారు.

అంతటితో ఆగని ఆయన.. తిరుమలను దర్శించుకుంటే ఓ తెలియని పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుందన్నారు. స్వామివారిని దర్శించుకోవాలనీ ఎప్పుడో అనుకున్నాననీ కానీ షూటింగ్ కారణంగా వీలుకాలేదన్నారు. లక్కీగా ఈసారి ‘గ్యాంగ్ లీడర్’ సినిమా విడుదలకు ముందే వెంకన్నను చిత్రబృందం దర్శించుకుందని నాని మీడియాకు వివరించారు. ఇదిలా ఉంటే.. ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ఈ నెల 13న థియేటర్లలోకి రానున్న విషయం విదితమే.

Hero Nani Comments about Ysrcp MLA:

Hero Nani Comments about Ysrcp MLA

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ