అవును మీరు వింటున్నది నిజమే.. టాలీవుడ్ పవర్ స్టార్, జనసేనాధినేత పవన్ కల్యాణ్‌కు ఓ హీరోయిన్ లవ్ లెటర్ రాసింది. అయితే ఇదంతా ఇప్పుడు జరిగిన కథ కాదులెండి.. గతం. ఆ ప్రేమ జ్ఞాపకాలను ఇప్పుడు నెమరువేసుకున్న హీరోయిన్.. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. ఒకప్పుడు తెలుగులో చేసింది చిన్న సినిమాలే అయినా మంచి పేరు తెచ్చుకున్న నటి, ప్రస్తుత బీజేపీ మహిళా నేత మాధవీలత.
వాస్తవానికి.. పవన్‌కు ఉండే రేంజ్ టాలీవుడ్‌లో మరో హీరోకు దాదాపు లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పవన్‌ను ఫ్యాన్స్ ఎలా లవ్ చేస్తారో.. అంతేరీతిలో ఫ్యాన్స్ కోసం ఆయన ప్రేమను పంచుతూ ఉంటారు. అందుకే పవన్ అంటే వీరాభిమానులు పడి చచ్చిపోతుంటారు. అలా జనసేనానిని చిన్నప్పుడే చూసిన మాధవీలత.. ఒకప్పుడు రాసిన లవ్ లెటర్ ఇప్పుడు బయటిపెట్టింది. పవన్ అంటే మాధవికి పడిచచ్చేంత ప్రేమ. గతంలో రాసిన ప్రేమ కవితలను ఫేస్‌బుక్ వేదికగా ఆమె పోస్ట్ చేసింది.
అయితే ఆ ప్రేమ కవిత ఇప్పట్లో రాసింది కాదండోయ్.. 19 ఏళ్ల క్రితం నాటిది... అంటే 2000వ సంవత్సరం జూన్ 6న పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తాను రాసుకున్న ప్రేమ కవితన ఇదీ..
‘మనసులో ఏదో వేదన
కారణం తెలియక పడుతున్నా తపన
హృదయంలో అనురాగం అనే భావన
దానికో రూపం ఇచ్చేందుకే ఈ సాధన
నీవు కనిపించగానే నా హృదయంలో ఏదో బాధ
నా మనస్సుని ఎవరో గట్టిగా పట్టేసినట్టుగా వేదన
ఒకపక్క సంతోషం, మరోపక్క దుఃఖం కానీ.. కానీ ఎందుకో తెలీదు
నిను చూస్తున్న ప్రతీక్షణం నేను కారణం చెప్పలేని భావాలలో విలవిల్లాడిపోతాను. దానికి అర్థం ఏంటి? నేను ఎందుకిలా అవుతున్నాను?
ఇది ఆకర్షణా? ప్రేమ అనే వ్యామోహమా?
No. కానే కాదు. అటువంటిది కాదు. మరేంటి?…..’ అని తన మనసులోని ప్రేమను మాధవీ.. పవన్‌కు తెలియజేసింది. కాగా పవన్ అంటే పిచ్చి అని ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో.. పలు కార్యక్రమాల్లో మాధవీలత బాహాటంగా చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.