Advertisementt

RRRలో పులితో ఎన్టీఆర్ ఫైట్.. లీక్!

Tue 10th Sep 2019 02:32 PM
rrr update,ntr fight,tiger,rajamouli  RRRలో పులితో ఎన్టీఆర్ ఫైట్.. లీక్!
RRR Updates: Ntr Fight With Tiger.. ! RRRలో పులితో ఎన్టీఆర్ ఫైట్.. లీక్!
Advertisement
Ads by CJ

ఓటమి ఎరుగని దర్శకధీరుడిగా పేరుగాంచిన రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. స్టార్ హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ భారీ చిత్రం షూటింగ్ విజయవంతంగా జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే.. జక్కన్న, జూనియర్, చెర్రీ అభిమానులకు శుభవార్తే మరి.

అయితే తాజాగా.. జూనియర్ ఫైట్ గురించి చిన్నపాటి లీకులు వస్తున్నాయి. ఈ చిత్రంలో కొమ్రుంభీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇప్పటికే.. పులితో ఫైట్స్, డైలాగ్స్‌ ఎన్టీఆర్ తన సినిమాల్లో దగ్గరుండి మరీ కథలు మార్పులు చేసుకున్న రోజులున్నాయి. అయితే RRRలో కూడా ఎన్టీఆర్‌ కోసం ఓ పులి ఫైట్ పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఫైటే సినిమాకు హైలైట్‌ అవుతుందని తెలుస్తోంది. అందుకే ఈ సన్నివేశాలను విజువలైజ్ చేసి చూపిస్తున్నట్లు సమాచారంజ. కాగా.. ప్రస్తుతం బల్గేరియాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మరి నిజంగానే ఈ ఫైట్ సినిమాలో ఉంటుందా..? లేకుంటే పుకారుగానే మిగిలిపోతుందా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

RRR Updates: Ntr Fight With Tiger.. !:

RRR Updates: Ntr Fight With Tiger.. !  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ