సౌత్‌లో భారీ క్రేజ్ ఉండే హీరోయిన్లలో ఒకరైన సమంత గురించి చిన్నపాటి వార్త అయినా సెన్సేషనల్ అవుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ పుకార్లు మరింత ఎక్కవయ్యాయి. అదేదో సామెత ఉంది కదా.. పళ్లు ఉన్న చెట్టుకే రాళ్లు అన్నట్లుగా.. స్టార్ హీరోయిన్ కావడంతో సామ్‌పై ఎక్కువగా వార్తలు వచ్చేస్తున్నాయి. సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి అక్కినేని కోడలు అయినప్పటికీ ఇంతవరకూ ఈమె అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ఈమె కాల్షీట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కట్టిన రోజులే ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ మధ్య సామ్ దగ్గరికి ఏ ప్రాజెక్టు వెళ్లినా నో చెప్పిందని.. రెండేళ్ల తర్వాత కథలు చూద్దాం అంతవరకూ సెలవు అని చెప్పిందని.. ఇందుకు కారణం ఆమె తల్లి కావాలని ఫిక్స్ అయ్యిందని.. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ అని కూడా వార్తలు వినవచ్చాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఓ ఇంటర్వ్యూ వేదికగా సామ్ క్లారిటీ ఇచ్చుకుంది.
ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సామ్.. అబ్బే అవన్నీ పుకార్లు అంతేనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అలాంటి ఆలోచనలు ఏమీ లేవని క్లారిటీ ఇచ్చింది. అంతటితో ఆగని ఆమె.. హీరోయిన్లు గతంలో కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తోందని.. అందంగా ఉన్నంతమాత్రాన సరిపోదని సామ్ చెప్పుకొచ్చింది.