Advertisementt

నా ఉన్నతికి కారణమైనవారికి కృతజ్ఞతలు: నిర్మాత

Tue 10th Sep 2019 02:52 PM
tummalapalli ramasatyanarayana,thanks,directors,producers,success  నా ఉన్నతికి కారణమైనవారికి కృతజ్ఞతలు: నిర్మాత
Tummalapalli Ramasatyanarayana says Thanks to His Directors and Producers నా ఉన్నతికి కారణమైనవారికి కృతజ్ఞతలు: నిర్మాత
Advertisement
Ads by CJ

నేను ఈరోజు ఈ స్థానంలో ఉండడానికి కారణమైన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు: తుమ్మలపల్లి రామసత్యనారాయణ

తుమ్మలపల్లి రామసత్యనారాయణ 2004లో సినిమా రంగంపై మక్కువతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తెలిసి తెలియక అనేకమంది చేతిలో మోసపోయిన ఆయన డబ్బు అంతా పోగొట్టుకున్నారు. అయినా సరే ఈ రంగంలో నిలదొక్కుకోవాలని ఎలాగైనా సినిమాలు చేయాలని ముందుకు కదిలారు. ఇండస్ట్రీలో ఒక నిర్మాత చిన్న సినిమా ప్లాప్ తీస్తే మళ్ళీ కనపడలేని పరిస్థితులలో చిన్న నిర్మాతలు ఉన్నారు. ఇలాంటి సినిమా ఫీల్డ్ లో ప్లాప్ ఐనా సేఫ్‌గా ఎలా ఉండాలనేది రామసత్యనారాయణ ఆలోచించారు. అందుకోసం బడ్జెట్‌ని కంట్రోల్ పెట్టుకుని సినిమాలు తీస్తు వెళుతున్నారు. దాదాపు 97 చిత్రాలు నిర్మించిన ఆయన 98వ సినిమాగా శివ 143ని నిర్మించారు. 99వ సినిమా అతి త్వరలో తనకు చాలా ఇష్టమైన దర్శకుడు.. వివాదాస్పద దర్శకుడుతో ప్లాన్ చేస్తున్నారు. కథ రెడీ అవుతుంది.

రామసత్యనారాయణ  నటుడిగా లక్ష్మీనరసింహ, ఘంటసాల బయోపిక్ లాంటి సినిమాలతో పాటు సుమారు 75 సినిమాలలో మంచి పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం శివ 143 సినిమాలో రాష్ట్రపతి పాత్రలో నటించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరిన్ని సినిమాల్లో మంచి పాత్రలు రామసత్యనారాయణను వరిస్తున్నాయి. త్వరలో ఆ వివరాలు తెలుపుతారు. సినిమాల్లో వేషాలు, మంచి చిత్రాల నిర్మాణంలో ఆయన సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. 

100వ చిత్రం శతాధిక చిత్రాల దర్శకుడు చేస్తాను అని మాట ఇచ్చారని, ఆయన పిలుపుకోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు రామసత్యనారాయణ. తాను ఈ రోజు ఇలా ఉండటానికి కారణం ప్రముఖ నిర్మాత కళ్యాణ్ గారి ఆశీస్సులు.. కోడి రామకృష్ణగారి పరిచయం వల్లేనని ఆయన చెప్పుకొచ్చారు. కీర్తి శేషులు శ్రీ దాసరిగారి పరిచయం మరువలేనిదని ఆయన అంటారు. అలాగే శ్రీ కొణిజేటి రోశయ్య గారి సహకారం మరువలేనిదని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తనని ఇష్టపడే దర్శకులు, చాలా ఇష్టమైన దర్శకులు VV వినాయక్, రాంగోపాల్ వర్మ అని ఆయన అన్నారు. ఈ రోజు ఇన్ని సినిమాలు తీసాను అంటే ఇంత మంది సపోర్టు ఉంది కాబట్టే అని తెలిపి వారికి కృతజ్ఞతలను తెలిపారు.

Tummalapalli Ramasatyanarayana says Thanks to His Directors and Producers :

Tummalapalli Ramasatyanarayana about his success 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ