మదర్ సెంటిమెంట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఎర్రచీర గ్రాఫిక్ హంగులు పులుముకుంటోంది. బేబి ఢమరి సమర్పణలో, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్ పతాకంపై సి.హెచ్ సత్యసుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో బేబి సాయితేజశ్విని, శ్రీకాంత్ ప్రధాన పాత్రలలో నిర్మితమవుతున్న విషయం విదితమే. హర్రర్, యాక్షన్, సస్పెన్స్ లతో కూడిన కథ కావడంతో గ్రాఫిక్స్ ముఖ్య భూమికను పోషించనున్నాయి. కాగా దర్శకులు సి.హెచ్.సత్యసుమన్ బాబు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ఎర్రచీర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.
ఈ ఎర్రచీర చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తోట సతీష్, మాటలు: గోపీవిమలపుత్ర, ఫైట్స్: నందు, కెమెరా: చందు, ఆర్ట్: సుభాష్, నాని, సంగీతం: ప్రమోద్ పులిగిల్ల.