Advertisementt

దసరాకి ‘ఊరంతా అనుకుంటున్నారు’

Wed 11th Sep 2019 09:19 PM
oorantha anukuntunnaru movie,naveen vijay krishna,balaji sanala  దసరాకి ‘ఊరంతా అనుకుంటున్నారు’
Oorantha Anukuntunnaru Movie Censor Completed దసరాకి ‘ఊరంతా అనుకుంటున్నారు’
Advertisement
Ads by CJ

క్లీన్ యు స‌ర్టిఫికేట్‌తో సెన్సార్ పూర్తి చేసుకుని ద‌స‌రా సంద‌డికి సిద్ధ‌మ‌వుతోన్న న‌వీన్ విజ‌య్ కృష్ణ ‘ఊరంతా అనుకుంటున్నారు’

‘నందిని నర్సింగ్ హోమ్’ చిత్రంతో కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొన్న నవీన్ విజయ్ కృష్ణ హీరోగా బాలాజీ సానల దర్శకత్వంలో రోవాస్కైర్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్‌పై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. సెన్సార్ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ ‘యు’ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రాన్ని ద‌స‌రా సంద‌ర్బంగా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాతలు‌ మాట్లాడుతూ.. ‘‘మా ‘ఊరంతా అనుకుంటున్నారు’ చిత్రం సూప‌ర్‌స్టార్ కృష్ణ నటించిన ఒకప్పటి పండంటి కాపురం, ఊరికి మొనగాడు, మహేష్ బాబు మురారి, ఇటీవలి శతమానం భవతి చిత్రాలు, అప్పటి అష్టా చ‌మ్మా లాంటి పండ‌గ సినిమాల‌ను గుర్తు చేసే మ‌రో పండ‌గ చిత్ర‌మే మా ‘ఊరంతా అనుకుంటున్నారు’.  కోనసీమ, చెన్నై, హైదరాబాద్ ల నేపథ్యాన్ని కెమెరామెన్ జి.ఎల్.ఎన్. బాబు అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో తెర‌పై ఆవిష్క‌రించారు. అలాగే కె.ఎం. రాధాకృష్ణన్ పాటలు, నేపథ్య సంగీతం చ‌క్క‌గా కుదిరాయి. సున్నితమైన ఫ్యామిలీ కామెడీతో పాటు జయసుధ- రావు రమేష్ ల మధ్య, నవీన్ విజయకృష్ణ - శ్రీనివాస్ అవసరాల మధ్య సన్నివేశాలు భావోద్వేగాన్ని కలిగించేలా దర్శకుడు బాలాజీ సానల చిత్రీకరించారు. ఈ పండ‌గలాంటి సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

Oorantha Anukuntunnaru Movie Censor Completed:

Oorantha Anukuntunnaru Movie Release Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ