Advertisementt

రవిబాబు నెక్ట్స్ సినిమా ఇదే..!

Thu 12th Sep 2019 09:27 AM
aaviri,ravibabu,dil raju,ravibabu aaviri  రవిబాబు నెక్ట్స్ సినిమా ఇదే..!
Ravibabu Next Film Title announced రవిబాబు నెక్ట్స్ సినిమా ఇదే..!
Advertisement
Ads by CJ

దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ర‌విబాబు ద‌ర్శ‌క నిర్మాతగా అక్టోబ‌ర్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ‘ఆవిరి’

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఏ ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ర‌విబాబు దర్శ‌క నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆవిరి’. ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా నటిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘కామెడీ, హార‌ర్ థ్రిల్ల‌ర్‌ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో ర‌విబాబు స్పెష‌లిస్ట్‌. ఈ రెండు జోన‌ర్స్‌లో ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాలు సూప‌ర్‌డూప‌ర్ హిట్స్ అయ్యాయి. అలాంటి టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌తో అసోసియేట్ కావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ర‌విబాబు ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందుతోన్న `ఆవిరి` ప్రేక్ష‌కులను మెప్పించే చిత్ర‌మ‌వుతుంది. అక్టోబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం`` అన్నారు.

ద‌ర్శ‌క నిర్మాత ర‌విబాబు మాట్లాడుతూ - ``దిల్‌రాజుతో క‌లిసి ఓ సినిమా చేయాల‌ని 15 సంవ‌త్స‌రాలుగా అనుకుంటున్నాను. కానీ కుద‌ర‌లేదు, ఇప్పుడు కుదిరింది. `ఆవిరి` సినిమాకు ఆయ‌నతో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం చాలా హ్యాపీగా ఉంది. ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. అక్టోబ‌ర్‌లో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

Ravibabu Next Film Title announced:

Aaviri is the Ravibabu next Film 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ