Advertisementt

ఆదిత్య ద్వారా ‘లైఫ్ అనుభవించు రాజా’

Thu 12th Sep 2019 07:06 PM
anubhavinchu raja,audio rights,aditya music,suresh thirumur,anubhavinchu raja movie  ఆదిత్య ద్వారా ‘లైఫ్ అనుభవించు రాజా’
Aditya Music Bagged Life Anubhavinchu Raja Audio Rights with Fancy Rate ఆదిత్య ద్వారా ‘లైఫ్ అనుభవించు రాజా’
Advertisement
Ads by CJ

రాజారెడ్డి మూవీ మేకర్స్ పతాకంపై, ఎఫ్ అండ్ ఆర్ సమర్పణలో రవితేజ(జూనియర్), శృతి శెట్టి, శ్రావణి నిక్కీ హీరోహీరోయిన్లుగా సురేష్ తిరుమూర్ దర్శకత్వంలో.. రాజారెడ్డి కందల  నిర్మించిన రామ్ కామ్ ఎంటర్‌టైనర్ ‘లైఫ్ అనుభవించు రాజా’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్‌ని ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య ఫాన్సీ రేటుకు సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సురేష్ తిరుమూర్ మాట్లాడుతూ.. ‘‘చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రం బాగా రావడానికి నిర్మాత ఎంతగానో తోడ్పాటు అందించారు. నటీనటులు కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. ప్రముఖ సంగీత దర్శకులు ఏ.ఆర్. రెహమాన్‌గారి స్కూల్‌ నుంచి వచ్చిన మా సంగీత దర్శకుడు రామ్ అందించిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. మా చిత్ర ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు ఫ్యాన్సీ రేటుకు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. త్వరలో ఆడియో మరియు మూవీ విడుదల తేదీలను ప్రకటిస్తాము..’’ అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: రామ్, కెమెరామెన్: రజిని, ఎడిటింగ్: సునీల్ మహరాణా, నిర్మాత: రాజారెడ్డి కందల, కథ-స్ర్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: సురేష్ తిరుమూర్.

Aditya Music Bagged Life Anubhavinchu Raja Audio Rights with Fancy Rate:

Anubhavinchu Raja Audio Rights sold out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ