Advertisementt

గోపీచంద్ న్యూ మూవీ షూటింగ్ స్టార్ట్స్

Sat 14th Sep 2019 10:58 AM
gopichand,sri venkateswara,cine chitra,banner,movie,update  గోపీచంద్ న్యూ మూవీ షూటింగ్ స్టార్ట్స్
Gopichand New Movie Shooting Started గోపీచంద్ న్యూ మూవీ షూటింగ్ స్టార్ట్స్
Advertisement
Ads by CJ

గోపీచంద్‌ హీరోగా శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి ప‌తాకంపై బిను సుబ్ర‌మ‌ణ్యం ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

మ్యాచో హీరో గోపీచంద్‌ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్.ఎల్‌.పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.26గా సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్న కొత్త చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ఈరోజు నుండి ప్రారంభ‌మైంది. బిను సుబ్ర‌మ‌ణ్యం ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాను ఇండియా స‌హా నేపాల్‌, కాంబోడియా, థాయ‌లాండ్‌లో  చిత్రీక‌రిస్తారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి స‌తీశ్ కురుప్ కెమెరా వ‌ర్క్‌ను అందిస్తున్నారు. హీరోయిన్ స‌హా మిగిలిన న‌టీన‌టుల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని యూనిట్ తెలియ‌జేసింది. 

సాహ‌సం త‌ర్వాత గోపీచంద్, బి.వి.ఎస్‌.ఎన్ ప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్ర‌మిది. గోపీచంద్‌ను స‌రికొత్త కోణంలో ఆవిష్క‌రించ‌నున్నామ‌ని, అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించే చిత్ర‌మ‌వుతుంద‌ని ద‌ర్శ‌కుడు బిను సుబ్ర‌హ్మ‌ణ్యం తెలిపారు. 

ద‌ర్శ‌క‌త్వం:  బిను సుబ్ర‌మ‌ణ్యం

నిర్మాత‌:  బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌

సినిమాటోగ్ర‌ఫీ:  స‌తీశ్ కురుప్‌

సంగీతం:  మ‌ణిశ‌ర్మ‌

ఆర్ట్‌:  అవినాష్ కొల్ల‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  సి.హెచ్‌.న‌ర‌సింహాచారి

పి.ఆర్.ఒ:  వంశీ కాకా 

Gopichand New Movie Shooting Started:

Gopichand and Sri Venkateswara Cine Chitra Banner Movie Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ