ఇలియానా.. ఈ పేరు చెబితే ఒకప్పుడు కుర్రకారుకు నిద్రపట్టేది కాదు.. ఈ వయ్యారి నడుము భామ సినిమా థియేటర్లలోకి వచ్చిందంటే చాలు కుర్రాళ్లు క్యూ కట్టేవారు. అయితే టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ చేసింది కాసిన్ని సినిమాలే అయినా పెద్ద ఎత్తునే ఫాలోయింగ్ పెట్టుకుంది. ప్రస్తుతానికి టాలీవుడ్‌కు దూరంగా.. బాలీవుడ్‌కు దగ్గరగా ఉన్న ఇల్లీబేబీ.. మళ్లీ మెగాస్టార్ చిరంజీవి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోందని వార్తలు వస్తున్నాయ్.
ఇక అసలు విషయానికొస్తే.. టాలీవుడ్‌కు ఇల్లీ దూరమవ్వడంతో ఆమెను ఎవరితోనూ కుర్రాళ్లు పోల్చుకోలేకపోతున్నారు. అయితే ఆ ముద్దుగుమ్మను మించి మరో అందాల భామ దొరకడంతో.. ‘టాలీవుడ్‌కు మరో ఇలియానా దొరికిందోచ్’ అని కుర్రాళ్లు అనుకుంటున్నారు. ఆ బ్యూటీ మరెవ్వరో కాదండోయ్.. కన్నడ బ్యూటీ ‘నభా నటేష్’. ఈమె కచ్చితంగా ఇలియానా లేని లోటును తీరుస్తున్నట్లే కనిపిస్తోంది.
ఇప్పటికే ‘నన్ను దోచుకుందువటే’, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలు అందాలు ఆరబోసిన ఈ భామను చూసి ‘ఇలియానా-2’ అని నెటిజన్లు, సినీ ప్రియులు పేర్లు పెట్టేస్తున్నారు. పూరీ జగన్నాథ్ సినిమాతో మంచిపేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ మరిన్ని మంచి అవకాశాలు దక్కించుకుని.. మంచి స్థాయిలో ఉండాలని మనమూ ఆశిద్ధాం.