Advertisementt

‘ప్రేమ పిపాసి’ మోషన్ పోస్టర్ విడుదల

Sat 14th Sep 2019 09:14 PM
prema pipaasi,motion poster,release,event,details  ‘ప్రేమ పిపాసి’ మోషన్ పోస్టర్ విడుదల
Prema Pipaasi Motion Poster Released ‘ప్రేమ పిపాసి’ మోషన్ పోస్టర్ విడుదల
Advertisement
Ads by CJ

సినీ ప్రముఖుల చేతుల మీదుగా ‘ప్రేమ పిపాసి’ మోషన్ పోస్టర్ లాంచ్ 

ఎస్ఎస్ ఆర్ట్  ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రాహుల్ బాయ్ మీడియా అండ్ దుర్గ‌శ్రీ ఫిలింస్ తో కలిసి  పి.ఎస్.రామ‌కృష్ణ(ఆర్‌.కె) నిర్మిస్తోన్న చిత్రం  ‘ప్రేమ పిపాసి’ ( సెర్చింగ్ ఫ‌ర్ ట్రూ ల‌వ్ అనేది ట్యాగ్ లైన్). ముర‌ళి రామస్వామి అనే నూత‌న ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని డైర‌క్ట్ చేస్తున్నారు. జిపిఎస్, క‌పిలాక్షి మ‌ల్హోత్రా, సోనాక్షి వ‌ర్మ, మౌని, మ‌మ‌త‌శ్రీ చౌద‌రి ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో, సుమ‌న్ కీల‌క‌పాత్ర‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ని ఈ శుక్రవారం శిల్పకళావేదికలో ప్రముఖ సీనియర్ నటి జమున, సహజ నటి జయసుధ, నటుడు బాబుమోహన్, నిర్మాతలు సి. కళ్యాణ్, అంబటి రామకృష్ణ చేతుల మీదుగా లాంచ్ చేసారు. ఈ కార్యాక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు ‘ప్రేమ పిపాసి’ మోషన్ పోస్టర్ టైటిల్ చాలా బావుందంటూ... ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలని ఆకాక్షించారు. 

నిర్మాత మాట్లాడుతూ... ‘‘శిల్పకళావేదికలో ‘వెండి తెర’ అవార్డ్స్ లో మా సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం కల్పించిన విష్ణు గారికి ధన్యవాదాలు. అలాగే మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సీనియర్ నటి జమున, సహజనటి జయసుధ, నటుడు బాబుమోహన్, నిర్మాతలు సి. కళ్యాణ్, అంబటి రామకృష్ణ గార్లకు కృతఙ్ఞతలు. సినిమా అనుకున్న విధంగా వచ్చింది. త్వరలో ఆడియోతో పాటు టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. 

చిత్ర ద‌ర్శ‌కుడు ముర‌ళి రామ‌స్వామి మాట్లాడుతూ... ‘‘మా సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన జమున, జయసుధ, బాబూమోహన్, సి. కళ్యాణ్, అంబటి గార్లకు ధన్యవాదాలు. ఇప్పటికే సినిమా డబ్బింగ్ పూర్తయింది. ఆర్. ఆర్ జరుగుతోంది. త్వరలో టీజర్ లాంచ్ చేస్తాం. ఇక సినిమా స్టోరీ విషయానికొస్తే ... ల‌వ్, రొమాన్స్, కామెడీతో పాటు యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. మ్యూజిక్ కి స్కోపున్న సినిమా. ప్ర‌తి క్యార‌క్ట‌ర్ ఎంతో నేచ‌ర‌ల్ గా బిహేవ్ చేస్తూ ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట‌య్యేలా ట్రెండీగా ఉంటుంది’’ అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో హీరో జిపిఎస్,  హీరోయిన్ క‌పిలాక్షి మ‌ల్హోత్రా మరియు చిత్ర టీం పాల్గొన్నారు. 

ఫ‌న్ బకెట్ భార్గ‌వ్, షేకింగ్ శేషు, జ‌బ‌ర్ద‌స్త్ రాజ‌మౌళి, ఫ‌స‌క్ శ‌శి త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్: తిరుమ‌ల రోడ్రిగ్జ్; మ్యూజిక్ : ఆర్స్ ;  పాట‌లు: సురేష్ ఉపాధ్యాయ‌; ఎడిట‌ర్: ఎస్ .జె. శివ కిర‌ణ్‌;  ఫైట్స్:  మిస్టర్  దేవ్;  కో-ప్రొడ్యూస‌ర్స్: రాహుల్ పండిట్, జియ‌స్ రావ్;  వై. వెంక‌ట‌ల‌క్ష్మి;  ప్రొడ్యూసర్  పి.య‌స్.రామ‌కృష్ణ‌(ఆర్‌.కె);  డైర‌క్ట‌ర్: ముర‌ళి రామ‌స్వామి.

Prema Pipaasi Motion Poster Released:

Prema Pipaasi Motion Poster Release Event details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ