పూరి తన నెక్స్ట్ మూవీ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈమూవీ కోసం హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు పూరి అండ్ ఛార్మి. ఇది పక్కన పెడితే.. మన టాలీవుడ్ లో శ్రీదేవి కూతురు ఎప్పటినుండో నటించాలనుకుంటుంది అని వార్తలు వస్తున్నాయి. శ్రీదేవి చివరి రోజుల్లో టాలీవుడ్ లో నటించబోతుందని వార్తలు వచ్చాయి. బాహుబలిలో రమ్యకృష్ణ ప్లేస్ లో శ్రీదేవి నటించాల్సిఉంది కానీ ఆమె ఎక్కువ రెమ్యూనరేషన్ చెప్పడంతో వెనక్కి తగ్గారు జక్కన్న.
ఆ తరువాత ఫోకస్ మొత్తం తన కూతురు జాహ్నవి కపూర్ మీది పడింది. ఈమెను టాలీవుడ్ లోకి తీసుకుని రావడానికి చాలామంది దర్శకనిర్మాతలు ట్రై చేస్తున్నారు. అలానే పూరి కూడా ట్రై చేస్తున్నారు. విజయ్ దేవరకొండ సినిమా కోసం ఆమె తీసుకుంద్దాం అని ట్రై చేస్తున్నారు. అందుకే ఛార్మి లేటెస్ట్ గా ముంబై వెళ్లి జాహ్నవి కపూర్ ని కలిసి కథ చెప్పిందట! అంతా ఓకే కానీ, జాహ్నవి తన రెమ్యూనరేషన్ చెప్పేసరికి ఛార్మికి నోట మాట రాలేదట! ఆమె అక్షరాలా నాలుగు కోట్లు ఇస్తేనే మీ సినిమా చేస్తానని అందని అంటున్నారు. దాంతో ఛార్మి అలా నోరు వెళ్లబోసుకుని వచ్చేసిందని టాక్. మన టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అని చెప్పుకునే సామ్ కానీ నయనతార కానీ అంత చెప్పలేదు ఇప్పటివరకు. అలాంటిది జాహ్నవి చెప్పడంతో షాక్ తిన్నారు. నాలుగు కోట్లు ఎట్టిపరిస్థితుల్లో కష్టమే అంటున్నారు.