మన్ముథుడు-02 సినిమా ఆశించినంతగా ఆడకపోయే సరికి కాస్త అసంతృప్తికి లోనైన అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం వెండి తెరను పక్కనెట్టి బుల్లి తెరపై వస్తున్న బిగ్‌బాస్-03కు మాత్రమే పరిమితం అయ్యారు. అయితే.. ఈ షో వంద రోజులు పూర్తవ్వగానే కల్యాణ్ కష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ చిత్రంలో నాగ్‌తో పాటు తన కుమారుడు చైతూ కూడా నటిస్తున్నాడు.
ఆయన ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీబిజీగా ఉండటం.. నాగ్ కూడా బిగ్‌బాస్‌తో గ్యాప్ లేకుండా ఉండటంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టును పెండింగ్‌లో పెట్టాలని అక్కినేని అనుకుంటున్నారట. అయితే ఈ గ్యాప్‌లో స్క్రిప్ట్ రైటర్ ‘సోల్‌మన్’తో సినిమా చేయాలని నాగ్ ఫిక్స్ అయ్యాడట. ఇటీవలే ఆయన కథ చెప్పగా నాగ్‌కు చాలా బాగా నచ్చిందట.
అందుకే ఇక ఆలస్యం చేయకుండా.. ఇప్పటి వరకూ జరిగిన లోటును ఈ సినిమాతో కవర్ అవుతుందని నాగ్ ఓ నిర్ణయానికొచ్చాడట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. అయితే రాహుల్ రవీంద్రన్ సినిమాతో దెబ్బతిన్న నాగ్.. ఈ సినిమాతో పరిస్థితితో ఎలా ఉంటుందో..? అసలు ఇది పట్టాలెక్కే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.