మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అక్టోబర్ 2 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్‌లో చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై పలువురు రాజకీయ సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, టాలీవుడ్‌కు బాగా కావాల్సిన వ్యక్తి, కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి రియాక్ట్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూ వేదికగా టీఎస్సార్ సైరా గురించి మాట్లాడారు.
నిజంగానే చిరు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘సైరా’ ఊహించని రేంజ్‌లో హిట్టవుతుందని ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్నారు. పవర్ ఫుల్ స్టోరీ కావడంతో అందర్నీ మెప్పిస్తుందన్నారు. అల్లు అరవింద్-దిల్ రాజు సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను తనతో షేర్ చేసుకున్నారన్నారు. అంతేకాదు.. ఒక్క మాటలో చెప్పాంటే చిరు ఇదివరకు సినిమాలకు ‘సైరా’కు చాలా తేడాగా ఉందని తెలిపారు.
అంతటితో ఆగని ఆయన.. చిరు ఫెర్ఫామెన్స్ బ్రిలియంట్ అని కితాబిచ్చారు. చెర్రీ గురించి మాట్లాడిన ఆయన.. రామ్ చరణ్ లావిష్ పెట్టుబడులు ఇవన్నీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అన్నారు. ఫైనల్‌గా ఒక్క మాటలో చెప్పాలంటే టీఎస్సార్ నుంచి సైరా రిపోర్టు పూర్తిగా వచ్చేసిందన్న మాట. మరి జనాలను ‘సైరా’ ఏ మాత్రం మెప్పిస్తాడో వేచి చూడాలి మరి.