Advertisementt

‘RDX ల‌వ్‌’.. రిలీజ్ డేట్ ఫిక్సయింది

Mon 16th Sep 2019 09:25 PM
rdx love,movie,release,october 11  ‘RDX ల‌వ్‌’.. రిలీజ్ డేట్ ఫిక్సయింది
RDX Love Movie Release Date Fixed ‘RDX ల‌వ్‌’.. రిలీజ్ డేట్ ఫిక్సయింది
Advertisement
Ads by CJ

అక్టోబ‌ర్ 11న విడుద‌ల‌వుతున్న పాయల్ రాజ్‌పుత్‌ ‘RDX  ల‌వ్‌’

‘RX 100’ ఫేమ్ పాయ‌ల్ రాజ్‌పుత్‌, తేజస్ కంచ‌ర్ల ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో రామ్ మునీష్ సమర్ప‌కుడిగా హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తోన్న‌ చిత్రం ‘RDX  ల‌వ్‌’. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్ 11న విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ ట్రైల‌ర్‌లోని యాక్ష‌న్ స‌న్నివేశాలు, డైలాగ్స్‌తో పాయ‌ల్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. అలాగే టీజ‌ర్‌, పోస్ట‌ర్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. న‌రేశ్‌, నాగినీడు, తుల‌సి, ఆమ‌ని త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌ధ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సి.రాంప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

నటీనటులు:

పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల, వి.కె.నరేశ్, ఆదిత్య మీనన్, నాగినీడు, తులసి, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, సత్య శ్రీ, సాహితీ, దేవిశ్రీ, జోయా మీర్జా తదితరులు

సాంకేతిక వర్గం:

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్ భాను

నిర్మాత: సి.కల్యాణ్

కో ప్రొడ్యూసర్: సి.వి.రావు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిన్నా

మ్యూజిక్: రధన్

సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్

ఎడిటర్: ప్రవీణ్ పూడి

డైలాగ్స్: పరుశురాం

ఫైట్స్: నందు

కొరియోగ్రఫీ: గణేశ్ స్వామి

పి.ఆర్.ఒ: వంశీ శేఖర్

RDX Love Movie Release Date Fixed:

RDX Love Movie Release on October 11th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ