ఒకప్పటి టాలీవుడ్ నటి, వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజాపై.. జనసేన కీలకనేత నాగబాబు గుర్రుగా ఉన్నారా..? తమ్ముడు పవన్ కల్యాణ్‌ను తిట్టిన ఈ ఫైర్‌బ్రాండ్‌కకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని భావిస్తున్నారా..? నాగబాబు రియాక్ట్ అయిన తర్వాత పవన్ కూడా రియాక్ట్ అవుతారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది.
వైఎస్ జగన్ వంద రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రోజా స్పందిస్తూ.. ‘గతంలో పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా చంద్రబాబు బురదజల్లించారు.. ఇప్పుడు కూడా పవన్ ద్వారా సర్కార్‌పై విమర్శలు చేయిస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై బుక్ రిలీజ్ చేసిన పవన్.. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు గురించి ఎందుకు విడుదల చేయలేదు..?. ఎన్టీఆర్ భవన్ ముద్రించిన పుస్తకాన్ని జనసేనలో రిలీజ్ చేసింది. ప్యాకేజీలు తీసుకుని పవన్ ఇంకా చంద్రబాబుకు పనిచేస్తున్నారు’ అని రోజా సంచలన ఆరోపణలు చేశారు.
అయితే పదేపదే తనపై రోజా విమర్శలు గుప్పించడంతో పవన్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారట. మొదట నాగబాబు ‘మై చానెల్ నా ఇష్టం’ ద్వారా లేదా మీడియా మీట్ పెట్టి మాట్లాడతారని తెలుస్తోంది. ఆ తర్వాత పవన్ రోజా గురించి మాట్లాడతారని తెలుస్తోంది. రోజాకు కౌంటరిస్తే.. మళ్లీ ఆమె తప్పక ఇస్తారు.. ఇలా కౌంటర్లతోనే సరిపెట్టుకుంటారా..? లేకపోతే మిన్నకుండిపోతారా అనేది తెలియాల్సి ఉంది.