Advertisementt

‘సైరా’: ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు

Wed 18th Sep 2019 02:23 PM
chiranjeevi,worry,sye raa,promotions,mega fans  ‘సైరా’: ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు
Mega Fans Worry with Sye Raa Promotions ‘సైరా’: ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు
Advertisement
Ads by CJ

సైరా సినిమా విడుదలకు కేవలం 15 రోజుల టైం మాత్రమే ఉంది. ఇంతవరకు సైరా ప్రమోషన్స్ మొదలవ్వలేదు. సైరా సినిమాని ఇండియా వైడ్ గా భారీగా బిజినెస్ చేసింది. కొన్ని ఏరియాలలో చిరు స్టామినాతో సైరా హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అంతా బాగానే ఉంది. ఇండియాలోని పలు భాషల్లో తెరకెక్కిన సైరా సినిమా ప్రమోషన్స్ విషయంలో ఇంకా గందరగోళం నెలకొని ఉంది. 15 రోజుల్లో ఎంత గట్టిగా చేసినా.. ప్రమోషన్స్ పక్కాగా లేకపోతే నిర్మాతలు కాదు... సినిమా కొన్న బయ్యర్లు నష్టపోవాలి.

మరి సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటుగా ట్రైలర్ లాంచ్ ని ఇండియా వైడ్ గా తలదన్నే రీతిలో చెయ్యాలని చూస్తున్నారు. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్, రాజమౌళిలు గెస్ట్ లుగా వస్తారు. కానీ బాలీవుడ్ వాళ్ళకి ఇక్కడ జరిగిన ఈవెంట్ ఏం ఎక్కుతుంది. అంటే రామ్ చరణ్ అక్కడ బాలీవుడ్ ముంబైలో సైరాకి భారీ ఈవెంట్ ప్లాన్ చెయ్యాలి. అలాగే మరో నాలుగు భాషల్లోనూ సైరా ఈవెంట్స్ చెయ్యాలి. మరి ఆ ప్లానింగ్ ఎక్కడా వినబడడం లేదు. మరోపక్క సైరా సినిమా పాటలు ఇంకా మార్కెట్ లోకి రాలేదంటూ మెగా ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. డ్యూయెట్స్ లేకపోయినా... సందర్భానుచితంగా వచ్చే పాటలైనా బయటికి వదిలితే కాస్త సినిమా మీద ఊపొస్తుంది. అదీ లేదు. కేవలం సోషల్ మీడియాలో వదులుతున్న పోస్టర్స్ తప్ప మరే సందడి కనబడడం లేదు. అసలు సైరా విషయంలో ఏం జరుగుతుందో అర్ధం కాక మెగా ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు.

Mega Fans Worry with Sye Raa Promotions:

What Happen to Sye Raa Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ