గత వారం రోజుల నుండి మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సైరా ట్రైలర్ చూద్దామా అని రోజులు గంటలు లెక్కబెడుతూ.. కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్యన సైరా ట్రైలర్ కొద్దీ క్షణాల క్రితమే రామ్ చరణ్, సురేందర్ రెడ్డి చేతుల మీదుగా విడుదలైంది. సైరా ట్రైలర్‌ని చూస్తుంటే... అదో విజువల్ వండర్‌లా ఉంది. యాక్షన్ సన్నివేశాల దగ్గరనుండి సినిమాలో నటించిన నటీనటుల లుక్స్ వరకు అన్ని అద్భుతః అన్న రేంజ్ లో ఉన్నాయి.
సైరా ట్రైలర్ లోకెళితే... సై రా నరసింహారెడ్డి.. బ్రిటిష్ వారిని తెగనరకడంతో మొదలయిన ట్రైలర్ లో.. సై రా నరసింహారెడ్డిని సంకెళ్లు వేసి బంధించి తీసుకెళుతుంటే.... బ్యాగ్రౌండ్ స్కోర్ లో నరసింహారెడ్డి సామాన్యుడు కాదు.. అతడొక కారణ జన్ముడు, అతనొక యోగి, అతనొక యోధుడు, అతన్నెవ్వరూ ఆపలేరు.. అంటూ సై రా పాత్రలో చిరు లుక్స్ అన్ని హైలెట్ అనేలా ఉన్నాయి. ఇక సై రా నరసింహారెడ్డి పాత్రలో చిరు ఎంతో ఎనర్జిటిక్‌గా.. ఎంతో పవర్ ఫుల్ గా చెప్పిన డైలాగ్.. ‘ఈ భూమి మీద పుట్టింది మేము, ఈ మట్టిలో కలిసేది మేము.. మీకెందుకు కట్టాలిరా సిస్తు’ అంటూ చెప్పిన భారీ డైలాగ్ ఒళ్ళు గగురు పొడిచేలా ఉంది. సై రా గురువు అమితాబ్ స్వాతంత్య్రం గురించి జరుగుతున్న తొలి యుద్ధమిది, ఈ యుద్ధం లో నువ్వు గెలవాలని సై రా ని ఉద్దేశించి చెప్పగా... నీ గెలుపుని కళ్లారా చూడాలి సై రా అంటూ కిచ్చా సుదీప్ పాత్ర చెప్పడం హైలెట్. వీరత్వానికి పేరుపడ్డ తమిళ భూమి నుండి వచ్చా.. రాముడికి లక్ష్మణుడి మాదిరిగా... మీతోనే ఉంటా.. అది విజయమో.. వీర మరణమే అంటూ విజయ్ సేతుపతి చెప్పిన డైలాగ్ కి గూస్ బంప్స్ వచ్చేసాయి.
మరి చిరంజీవి సై రా లుక్ అన్నిటికన్నా హైలెట్. ఆయన ఎనర్జిటిక్ నటన, లుక్స్, డైలాగ్ డెలివరీ అన్నిటా సూపర్ అనేలా ఉన్నాయి. అలాగే ఈ సినిమాకి యాక్షన్ సన్నివేశాలు హైలెట్ అనేలా ఉన్నాయి. దర్శకనిర్మాతలెక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని తెరకెక్కించారు. అమితాబ్ లుక్, నయనతార, తమన్నాల లుక్స్, విజయ్ సేతుపతి పాత్ర, ఆయన లుక్స్, కిచ్చా సుదీప్ పాత్ర, లుక్స్ అన్ని అదరహో అనేలా ఉన్నాయి. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ.. మెయిన్ హైలెట్ కాగా... బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరో హైలెట్. అచ్చంగా సై రా నరసింహారెడ్డి ట్రైలర్ విజువల్ వండర్ లా కనిపిస్తూ సినిమా మీద మరిన్ని రేట్లు అంచనాలు పెంచేలా చేసింది.