నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన గద్దలకొండ గణేష్(వాల్మీకి) సినిమాకి ప్రేక్షకులనుండి మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులే కాదు.. క్రిటిక్స్ కూడా వరుణ్ తేజ్ సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చారు. దర్శకుడు హరీష్ శంకర్ తమిళ జిగర్తాండని యాజిటీజ్ గా దించకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ గద్దలకొండ గణేష్ సినిమాని రీమేక్ చేసాడు. అయితే సినిమాలో వరుణ్ తేజ్ మాస్ లుక్, ఆయన డైలాగ్ డెలివరీ, కథ కథనం, మిక్కీ జె మేయర్ మ్యూజిక్, నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ అన్ని బావున్నప్పటికీ... స్లో నేరేషన్, సెకండ్ హాఫ్ వీక్ అవడం, కామెడీ తక్కువ కావడంతో సినిమాకి యావరేజ్ టాక్ పడింది.
అయితే సినిమాలోని సెకండ్ హాఫ్ లో పూజా హెగ్డే - వరుణ్ తేజ్ ల ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడే హైలెట్ అంటున్నారు. పూజా హెగ్డే శ్రీదేవి కేరెక్టర్‌లో అదరగొట్టడమే కాదు.. వరుణ్ తేజ్‌తో ఉన్న రొమాంటిక్ కాంబో సీన్స్‌కి విజిల్స్ పడుతున్నాయి. ఫస్ట్ హాఫ్ లో పూజా ఎంట్రీ లేక బోర్ కొట్టిన ప్రేక్షకులకు సెకండ్ హాఫ్‌లో వెల్లువచ్చి గోదారమ్మ సాంగ్‌తో కడుపునిండిపోయింది. సెకండ్ హాఫ్ మొత్తంలో ఆ పాటని ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేయించింది. పూజ గ్లామర్‌గా కాకుండా డి గ్లామర్‌గా అదరగొట్టేసింది. సెకండ్ హాఫ్‌లో ప్రేక్షకుడిని కాస్త ఊరటనిచ్చింది మాత్రం వరుణ్ తేజ్ ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్ లో పూజాతో చేసిన రొమాన్స్ అంటున్నారు.