Advertisementt

‘త్రీ మంకీస్’ అంత పెద్ద హిట్టవ్వాలి: నిర్మాత

Mon 23rd Sep 2019 05:33 PM
celebrities,speech,3 monkeys,movie,first look,launch  ‘త్రీ మంకీస్’ అంత పెద్ద హిట్టవ్వాలి: నిర్మాత
3 Monkeys Movie First Look Launch Event ‘త్రీ మంకీస్’ అంత పెద్ద హిట్టవ్వాలి: నిర్మాత
Advertisement
Ads by CJ

‘త్రీ  మంకీస్’ సినిమా ‘చిత్రం భళారే విచిత్రం’ అంత పెద్దహిట్ అవ్వాలి.. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి

జబర్దస్థ్ షో ద్వారా బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ బిగ్ స్క్రీన్ పై ‘త్రీ మంకీస్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. కారుణ్య చౌదరి హీరోయిన్ గా నటించింది. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ జి.దర్శకత్వంలో నగేష్ జి. నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్కును జరుపుకుంటుంది. ఈ చిత్రం లోగో, మరియు ఫస్ట్ లుక్ లాంచ్ విడుదల కార్యక్రమం సెప్టెంబర్ 22న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర యూనిట్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి మెగాబ్రదర్ నాగబాబు, ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిధులుగా విచ్చేసి త్రీ మంకీస్ లోగో, చిత్ర ఫస్ట్ లుక్ సంయుక్తంగా లాంచ్ చేసారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్, దర్శకుడు అనిల్ కుమార్, నిర్మాత నగేష్, కెమెరామెన్ సన్నీ దోమల పాల్గొన్నారు.

ఆ ముగ్గురి కామిడీ చూస్తే ఒక ఎనర్జీ వస్తుంది!!

ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. సుడిగాలి సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను ఈ ముగ్గురూ వేరు వేరు వ్యక్తులైనా .. కానీ ముగ్గురు ఒక్కటే. ఆవకాయ, పప్పు, నెయ్యి కలిస్తే ఎంత టేస్ట్ ఉంటుందో అలా వీళ్ళ ముగ్గురు కామిడీ  ఉంటుంది. నా ఐపాడ్ లో ఎప్పుడు వీళ్లు చేసిన స్కిట్స్ వంద ఉంటాయి. టెంక్షన్ లో వున్నప్పుడు, ట్రాఫిక్ లో వున్నప్పుడు వెంటనే ఐపాడ్లో వున్న స్కిట్స్ చూస్తాను. ఒక ఎనర్జీ వస్తుంది.  వెంటనే రిలాక్స్ అయిపోతాను. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఇంటికి ఎప్పుడొచ్చామా కూడా తెలీదు. అంత హ్యాపీగా వాళ్ళ స్కిట్స్ ఉంటాయి. వాళ్ళ కామిడీని బాగా ఎంజాయ్ చేస్తాను. సుధీర్, శ్రీను, రాంప్రసాద్ కలిసి నటించిన ‘త్రీ  మంకీస్’ చిత్రం భళారే విచిత్రం, అహనా పెళ్ళంట, ప్రేమకథాచిత్రం అంత పెద్దహిట్ కావాలి.. అన్నారు.

నాకు బాగా ఇష్టమైన టీమ్ అదే!!

మెగాబ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. ఈ సినిమా రిస్క్ అని కాకుండా జబర్దస్ట్ టీమ్ సుధీర్, శ్రీను, రాంప్రసాద్ లపై ఫోకస్ పెట్టి ఈ ‘త్రీ  మంకీస్’ మూవీని నిర్మించిన దర్శక, నిర్మాతలకు నా అభినందనలు. వాళ్లతో సినిమా తీసి వారు చాలా తెలివిగల పని చేసారు. ఎందుకంటే జబర్దస్ట్ లో సుధీర్ వాళ్ళ టీమ్ అంటే నాకు బాగా ఇష్టం. వాళ్ళ స్కిట్స్ ని బాగా ఎంజాయ్ చేస్తాను. అందరు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అసలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి లేకపోతే జబర్దస్ట్ అనేది లేదు. అతను ఓ క్రియేటర్. మా అందరికీ ఒక స్టేజ్ కల్పించి నేమ్ అండ్ ఫేమ్ తీసుకొచ్చారు. ఆయన ఎప్పుడు సీరియస్ మూడ్లో వుంటారు. కానీ అలాంటి వ్యక్తి జబర్దస్ట్ కామిడీ షో చేయడం విచిత్రంగా అనిపించింది. నాకు, రోజాకి జడ్జెస్ గా మంచి పేరు వచ్చిందంటే శ్యామ్ ప్రసాద్ వల్లే. జబర్దస్ట్ షో తెలుగు ఇండస్ట్రీకి రా మెటీరియల్ కమెడియన్స్ సప్లై చేస్తుంది. అందరూ ఒక పొటెన్షియాలిటీ వున్న కమెడియన్స్. సుధీర్ కామిడీ టైమింగ్, రాంప్రసాద్ పంచ్ డైలాగ్స్ ముఖ్యంగా గెటప్ శ్రీను నటన అంటే నాకు ఇష్టం. నేను ఎక్కువగా అభిమానించే ఆల్ టైం కమిడియన్ గెటప్ శ్రీను. అతను ఇంటర్నేషనల్ స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేయగల గొప్ప నటుడు. 90 రకాల గెటప్ లు వివిధమైన బాడీ లాంగ్వేజెస్ లో తన కామెడీతో అలరించాడు శ్రీను. నాకు కామిడీ చూడటం అంటే ఇష్టం. అన్నిభాష చిత్రాలు కామిడీ చూస్తాను. ఆ అనుభవంతో చెపుతున్నాను. గెటప్ శ్రీను అద్భుతమైన గొప్ప  ఆర్టిస్ట్. ఇలాంటి నటుల్ని తెలుగు ఇండస్ట్రీ ఉపయోగించుకోకపోతే ఒక ఆణిముత్యాన్ని, ఒక వజ్రాన్ని మిస్ చేసుకున్న వాళ్లమవుతాం. ఈ సినిమాతో అందరికీ మంచిపేరు రావాలని కోరుకుంటున్నాను... అన్నారు.

హీరోయిన్ కారుణ్య చౌదరి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నేను వన్ ఆఫ్ ది పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా వుంది. సెట్లో మేమంతా బాగా ఎంజాయ్ చేస్తూ చేశాం. ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రేక్షకులు ఈ సినిమాని చూసి సక్సెస్ చెయ్యాలని.. అన్నారు.

గెటప్ శ్రీను మాట్లాడుతూ.. జబర్దస్ట్ షో ద్వారా మమ్మల్ని ఆదరించి ప్రోత్సహించారు. అక్కడనుండి  వెనక్కిచూసుకోకుండా ముందుకు వెళ్తున్నాం. ఎంటర్టైన్మెంట్ ని బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకులు అనిల్. సినిమా అంతా నవ్వుతూనే వుంటారు.. అన్నారు.

రాంప్రసాద్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు బుల్లితెరపై నవ్వులు పూయించామ్. ఫస్ట్ టైమ్ బిగ్ స్క్రీన్ పై కలిసి అలరించడానికి వస్తున్నాం. ఆడియెన్స్ అందరినీ  పక్కాగా నవ్విస్తాం.. అన్నారు.

సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ఈ సినిమా మేము చేయడానికి అవినాష్ కారణం. స్క్రిప్ట్ వినగానే బాగా నచ్చింది. చెప్పింది చెప్పినట్లు తీశారు. కారుణ్య హీరోయిన్ గా మెయిన్ పాత్రలో నటించింది. ఆమె చుట్టూ కథ అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ అంతా నవ్విస్తాం. సెకండాఫ్లో అందరిని ఏడిపిస్తామ్... అన్నారు.

దర్శకుడు అనిల్ కుమార్ జి మాట్లాడుతూ.. జబర్దస్ట్ షో ద్వారా అందరినీ ఎంటర్టైన్ చేసిన సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను బిగ్ స్క్రీన్ పై ప్రేక్షకులను నవ్వించడానికి త్రీ మంకీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. స్కిప్ట్ ని నమ్మి ఈ సినిమా ఛేశామ్. నవ్విస్తూ.. అందర్నీ ఏడిపిస్తారు.. అన్నారు.

నిర్మాత నగేష్ జి. మాట్లాడుతూ.. డైరెక్టర్ అనిల్ నా క్లాస్ మేట్. మాది వరంగల్. ఈ సినిమా స్టోరీ చర్చలు అన్నీ అక్కడే జరిగాయి. స్క్రిప్ట్ వినగానే సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను అయితే బాగుంటుందని గట్టిగా పట్టుబట్టి ఈ చిత్రాన్ని నిర్మించాము. చాలా నాచురల్ గా షూటింగ్ చేశాం. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది.. అన్నారు.

సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, కారుణ్య చౌదరి, షకలక శంకర్, కౌటిల్య తదితరులు నటించిన ఈ చిత్రానికి డిఒపి: సన్నీ దోమల, సంగీతం: అనిల్ కుమార్ జి, ఎడిటింగ్: డి.ఉదయ్ కుమార్, మాటలు: అరుణ్ వి, పాటలు: శ్రీ మణి, లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిబాబు వాసిరెడ్డి, కో-ప్రొడ్యూసర్: ఎ. ఆర్.కె. మొ నరాల, నిర్మాత: నగేష్ జి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అనిల్ కుమార్ జి.

3 Monkeys Movie First Look Launch Event:

Celebrities speech at 3 Monkeys Movie First Look Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ