Advertisementt

ప్రజల్ని మోసగించడానికే.. ఈ భజన బ్యాచ్..!

Mon 23rd Sep 2019 09:33 PM
bhajana batch,sony liv,posani krishna murali,maruthi  ప్రజల్ని మోసగించడానికే.. ఈ భజన బ్యాచ్..!
Bhajana Batch - The Laughter Riot Begins on Sony LIV! ప్రజల్ని మోసగించడానికే.. ఈ భజన బ్యాచ్..!
Advertisement
Ads by CJ

భజన బ్యాచ్.. సోనీ లివ్ లో నవ్వుల ప్రయాణం మొదలు..

విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి ప్రధానపాత్రలో వస్తున్న కామెడీ డ్రామా భజన బ్యాచ్. సోనీ లివ్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్న ఈ కామెడీ డ్రామాకు ఈ రోజుల్లో, భలేభలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రేమ కథా చిత్రం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన ప్రముఖ దర్శకుడు మారుతి కాన్సెప్ట్ ఇచ్చారు. భజన బ్యాచ్ కామెడీ డ్రామాను మరో ప్రముఖ దర్శకుడు చిన్నికృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈయన గతంలో వీడు తేడా, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, లండన్ బాబులు, అక్షర లాంటి సినిమాలను తెరకెక్కించారు. గెటప్ శ్రీను, జెమిని సురేష్, అజయ్ ఘోష్,  జోగి కృష్ణంరాజు, జబర్దస్త్ వేణు, రాఘవ, షకలక శంకర్, అప్పారావు, శివ శంకర్ మాస్టర్ సహా జబర్దస్త్ లో సంచలనాలు సృష్టించిన ఇంకా చాలామంది ప్రముఖ నటులు ఈ కామెడీ డ్రామాలో నటిస్తున్నారు.

భజన బ్యాచ్ ప్రజలను మోసగించడానికి.. ప్రజల దృష్టి మరల్చడంలో.. ఇంకా ట్రిప్పింగ్ చేయడంలో నిపుణులైన కాన్ ఆర్టిస్టుల సమూహం చుట్టూ తిరుగుతుంది. అద్భుతమైన కామెడీ టైమింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పోసాని కృష్ణమురళి ఈ కామెడీ డ్రామాలో తనదైన పంచ్ డైలాగ్స్ తో కడుపుబ్బా నవ్వించడానికి రెడీ అవుతున్నారు.

సరి కొత్త కథలను.. కాన్సెప్ట్ లను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే ఐడ్రీమ్ మీడియా ఈ కామెడీ డ్రామాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది.

ఓవర్సీస్ ప్రేక్షకులకు యుప్పి టీవీలో భజన బ్యాచ్ లైవ్ స్ట్రీమ్ కానుంది. ముద్దుగారే యశోద వెబ్ సిరీస్ తర్వాత ఐడ్రీమ్ మీడియా నిర్మిస్తున్న రెండో డిజిటల్ సిరీస్ భజన బ్యాచ్. సోనీ లివ్ ఇండియాలో దీన్ని ప్రసారం చేయనుంది. సాంప్రదాయ మరియు మోడల్  కలిసిన అద్భుతమైన కాంబినేషన్ లో ముద్దుగారే యశోద వెబ్ సిరీస్ వచ్చింది. పవిత్ర లోకేష్, సమీర్, శృతి సింగంపల్లి, అప్పాజీ అంబరీష్ ఇందులో నటించారు.

Bhajana Batch - The Laughter Riot Begins on Sony LIV!:

Bhajana Batch Web Series Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ