మెగా హీరో వరుణ్ తేజ్, పూజా హెగ్దే నటీనటులుగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) చిత్రం సూపర్ డూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. సినిమా ఆశించిన దానికంటే ఎక్కువగానే ఈ మూడు రోజుల్లోనే కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే.. తాజాగా ఓ యూ ట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన హరీశ్.. హీరో విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
టాలీవుడ్‌లో యూత్ ఐకాన్‌గా పేరుగాంచిన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత విజయ్‌తో ఓ సినిమా తీయాలని భావించిన హరీశ్.. విజయ్ కథ చెబుతాను ఒకసారి కలుద్దాం అని మెసేజ్ పెట్టానన్నారు. ‘అన్నా.. నేను ఏడాదిన్నర- రెండేళ్ల వరకూ బిజీగా ఉన్నాను. సినిమా టాపిక్ కాకపోతే కలుద్దాం అని మెసేజ్ పెట్టాడు. సినిమా టాపిక్ కాకపోతే నీతో నాకు పనేం ఉంటుంది భయ్యా.. ఏడాదిన్నర తరువాతే కలుద్దాం అని నేను కూడా రిప్లై ఇచ్చాను’ అని హరీశ్ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై విజయ్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.