అవును ఐటెమ్ సాంగ్స్‌లో నటించి మెప్పించడమంటే అంతా ఆషామాషీ విషయం కాదు.. అలాంటిది కెరియర్‌లో నిలదొక్కుకోవాలంటే కొందరు నటీమణులు తప్పక చేయాల్సి వస్తోంది. మరికొందరు మాత్రం సినిమా.. సినిమానే.. ఐటెం సాంగ్స్ అడిషనల్ అంతేనంటూ అప్పుడప్పుడు ఇలా నటిస్తుంటారు. అలాంటి వారిలో ప్రస్తుతం టాలీవుడ్‌ను ఓ ఊపేస్తున్న, స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది పూజా హెగ్దే. స్టార్ హీరోలు మొదలుకుని జనరేషన్‌లు తేడా లేకుండా ఈ భామ నటించేస్తోంది.
అయితే.. ఐటెం సాంగ్స్ విషయానికొస్తే.. నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’.. నేడు మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ అంటూ హద్దులు లేకుండానే అందాలు ఆరోబోసింది. ‘జిగేల్ రాణి’ తర్వాత శ్రీదేవిగా ఈ పాట పూజాహెగ్దే కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా పూజాను మెచ్చుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదండోయ్ ఈ రెండు సాంగ్స్ మెగా హీరోలతోనే కావడం విశేషమని చెప్పుకోవచ్చు. అందుకే ఈ భామను పలువురు దర్శకనిర్మాతలు ఐటెం సాంగ్స్‌కు అడుగుతున్నారట. పూజా కాదంటేనే వేరే వాళ్లను దర్శకులు సంప్రదిస్తున్నారట.
వాస్తవానికి పూజాహెగ్దే ప్రస్తుతానికి టాలీవుడ్ క్వీన్‌గా రాణిస్తోంది. ఇటు సినిమాల్లో హీరోయిన్‌గా.. మరోవైపు అప్పుడప్పుడు జిగేల్ మంటూ మెరుస్తూ నిద్రపోతున్న కుర్రకారును నిద్రలేపుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పూజా ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతోంది. త్వరలోనే ప్రభాస్, అఖిల్ సరసన పూజా నటించబోతోంది.