‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో 14 రీల్స్ ప్లస్ బేనర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలయ్యి మొదటి షో నుండే పాజిటివ్ టాక్‌తో సూపర్‌హిట్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 23న హైదరాబాద్ జె.ఆర్.సి కన్వెన్షన్స్‌లో గ్రాండ్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో లిరిసిస్ట్ భాస్కరభట్ల మాట్లాడుతూ.. ‘‘14 రీల్స్ బేనర్‌కి ఈ సినిమా మంచి ప్లస్ అయింది. వరుణ్ విశ్వరూపం కనపడింది. హరీష్ ప్రతి డైలాగ్ చాలా బాగుంది. మిరపకాయ్ సినిమా నుండి ఆయనతో నా అనుబంధం కొనసాగుతుంది. మంచి పాటలు రాయడానికి కావాల్సిన సమయం ఇచ్చే దర్శకుడు. సినిమా వాళ్ళ కష్టాలు చూపించే సినిమా’’ అన్నారు.
నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘‘ఒక సారి హరీష్ శంకర్ నాతో అన్నారు ‘బాబాయి లైఫ్‌ని ఈజీగా తీసుకుంటేనే ఇంత కష్టం అవుతుందే.. ఇంకా సీరియస్‌గా తీసుకుంటే ఎలా ఉండేదో...’అని. హరీష్ జీవితాన్ని చదివారు కాబట్టే అంత గొప్ప డైలాగ్స్ రాయగలిగారు. ఈ సినిమాతో వరుణ్ అసాధారమైన నటుడు అని తెలిసింది. వరుణ్ ఈ సినిమాను కమిట్ అయ్యి చేశారు. ‘ఎల్లువచ్చి గోదారమ్మ’ పాటలో వరుణ్, పూజ పోటీపడి మరీ డాన్స్ చేశారు. నిర్మాతలు చాలా మంచి వారు. ఎంతో ఫ్యాషన్‌తో సినిమాని నిర్మించారు’’ అన్నారు.
నటి డింపుల్ హయాతి మాట్లాడుతూ.. ‘‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ సర్‌కి థ్యాంక్స్. అందరూ స్పెషల్‌సాంగ్ చాలా బాగుంది అని స్టేజి ఎక్కి మరి డాన్స్ వేస్తున్నారు. వరుణ్‌లుక్స్ అమేజింగ్. టీమ్ అందరికీ కంగ్రాట్స్’’ అన్నారు.
యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ మాట్లాడుతూ.. ‘‘నేను 2006 నుండి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను. కమర్షియల్ జోనర్‌లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. అలా నాకు ఈ అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ గారికి, నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంటగారికి థ్యాంక్స్. వారు చాలా హంబుల్ ప్రొడ్యూసర్స్. నేను థియేటర్‌కి వెళ్లి ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తున్నపుడు మాస్ మ్యూజిక్ లెవెల్ ఏంటో తెలిసింది. నా అసిస్టెంట్ వెంకీ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అలాగే సింగర్ అనురాగ్ కులకర్ణి ఒక పాటను మూడు వెర్షన్స్‌లో పాడడం అమేజింగ్ టాలెంట్’’ అన్నారు.
నటుడు సత్య మాట్లాడుతూ.. ‘‘నేను కూడా లైఫ్‌లో కాంప్రమైజ్ కాలేక ఇండస్ట్రీకి వచ్చాను. ఇక్కడ మంచి అవకాశం రావడం కష్టం. అలాంటి అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ గారికి నిర్మాతలకి థ్యాంక్స్. ప్రతి ఒక్కరి క్యారెక్టర్‌కి మంచి అప్లాజ్ వస్తుంది’’ అన్నారు.
ఎడిటర్ చోటా కె ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘చాలాకాలం తరువాత థియేటర్‌లో ఒక పాటను ఆపి రిపీట్ చేస్తున్నారు. అలాంటి ఒక మంచి సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు.
చిత్ర నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ.. ‘‘టైటిల్, రిలీజ్ డేట్ ఇలా అన్ని మారాయి. ఇంత ఎలా జరిగింది అనుకుంటే ఒకటే అనిపించింది ‘బాగున్న సినిమాను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రేక్షకులే నడిపిస్తారు’ అనే నమ్మకం కుదిరింది. ఆ నమ్మకమే ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చింది. స్పెషల్ సాంగ్ చేస్తున్నపుడు డింపుల్‌లో ఫ్యాషన్ కనిపించింది. మిక్కీ ఆసమ్ మ్యూజిక్ ఇచ్చారు. మాస్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్‌కి ఎలివేట్ అయ్యింది. బ్రహ్మానందంగారు ఈ సినిమాలో ఒక్క సీన్ అయినా మా గురించి వచ్చి చేసినందుకు థాంక్స్. పూజ చాలా ప్రొఫెషనల్‌గా చేసింది. వరుణ్ చాలా సాఫ్ట్ పర్సన్. అలాంటిది స్క్రీన్ మీద ఒక కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం గొప్ప విషయం. వరుణ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. రెండు మూడు రెడ్ బుల్స్ తాగితే ఎంత ఎనర్జీగా ఉంటామో ఎప్పుడూ అంత ఎనర్జీతో ఉంటారు హరీష్. ఈ సినిమా ఆన్ స్క్రీన్ వరుణ్ వన్ మాన్ షో అయితే ఆఫ్ స్క్రీన్ హరీష్ వన్ మాన్ షో. మృణాళిని సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. చాలా చక్కగా చేసింది. అలాగే మా సినిమాలో చిన్న క్యామియో చేసిన డైరెక్టర్ సుకుమార్‌గారికి, హీరో నితిన్ గారికి ధన్యవాదాలు. కలెక్షన్స్ విషయంలో ఒకటి మాత్రం చెప్పగలను మా బయ్యర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు ఎంత హ్యాపీ అంటే రెండు రోజుల్లోనే ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ వెనక్కి వచ్చింది. మూడో రోజుకి 70-75% వరకూ వచ్చింది. ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో మరో మీట్‌లో మాట్లాడుకుందాం’’ అన్నారు.
హీరోయిన్ మృణాళిని రవి మాట్లాడుతూ.. ‘‘డబ్‌స్మాష్ వీడియోలతో కెరీర్ స్టార్ట్ చేసిన నాకు ఈరోజు మాట్లాడడం ఒక డ్రీమ్‌లా ఉంది. ఈ సినిమాలో పార్ట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బుజ్జమ్మ క్యారెక్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.
హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ.. ‘‘ఈ క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చిన హరీష్ గారికి థాంక్స్. శ్రీదేవిగారి ఐకానిక్ సాంగ్ ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ స్క్రీన్ దగ్గరకు వెళ్లి డాన్స్ వేస్తున్న వీడియోస్ చాలా వస్తున్నాయి.. నేను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాను. నన్ను ఇంత బ్యూటిఫుల్‌గా చూపించిన బోస్ గారికి థాంక్స్. ఇంత ప్రేమ ఇచ్చిన ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. సిటీ మార్ తరువాత మరో మంచి సాంగ్. మిక్కీ నాకు గోపికమ్మా.. సాంగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ పాట ఇవ్వడం చాలా సంతోషం. హరీష్ గారు టాలెంటెడ్ డైరెక్టర్. వరుణ్ పెర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది’’ అన్నారు.
ఈ సినిమా గణవిజయం ‘వాల్మీకి మహర్షి’కి అంకితం
పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘ఇంకో ఆరు గంటల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని టైటిల్ మార్చినా సరే మా సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లిన మీడియా వారికి స్పెషల్ థాంక్స్. వారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. సినిమా గొప్పతనం గురించి మాట్లాడాలంటే 1000 కి పైగా సినిమాల్లో నటించి, తెలుగు భాష మీద అమోఘమైన పట్టు ఉన్న బ్రహ్మనందంగారే కరెక్ట్ అనిపించింది. సినిమా వాళ్ళ కష్టాల గురించి ఆయన మాట్లాడారు కాబట్టే అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్రహ్మానందంగారు ఉన్న ఎరాలో పుట్టడం మా అదృష్టం. ఆయన సినిమాలు చూడడం మాకు వరం. ఆయన్ని డైరెక్ట్ చేయడం గర్వకారణం. ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పటి నుండి నాతో ట్రావెల్ చేసిన మధు శ్రీనివాస్, మిధుల్ చైతన్య గారికి థాంక్స్. నాతో పాటు ఒక సంవత్సరం ట్రావెల్ అయ్యి స్క్రిప్ట్‌లో నాతో పాటు కూర్చున్నారు. తపన పడుతున్న డైరెక్టర్‌గా అధర్వ అద్భుతంగా నటించారు. ఈ సినిమా తరువాత తెలుగులో చాలా ఆఫర్స్ వస్తున్నాయి. మృణాలిని ఫ్యాషనేట్ యాక్ట్రెస్. డింపుల్ స్పెషల్ సాంగ్‌లో బాగా చేసింది. పూజ తప్ప ఆ క్యారెక్టర్‌కి ఇంకెవర్ని అనుకోలేదు. తాను కూడా చాలా కష్టపడి చేసింది. వరుణ్‌ని చాలా కన్వీన్స్ చేసి టైటిల్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అని వేసాం. వరుణ్ ఈ సినిమాలో ప్రాణం పెట్టి నటించాడు. ఆయన ఈ క్యారెక్టర్‌ని ఓన్ చేసుకున్న విధానం నాలోని రైటర్, డైరెక్టర్ ఇద్దర్ని ఆశ్చర్య పరిచింది. ఒక హీరో ఒక క్యారెక్టర్‌ని నమ్మి పెర్ఫామ్ చేస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది. థాంక్స్ వరుణ్. మిక్కీ పాటలు ఎంత హిట్ అయ్యాయో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతకన్నా హైలెట్ అయింది. రామ్ ఆచంట, గోపి ఆచంట చాలా ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ఏ రోజు ప్రొడక్షన్ నుండి ఇది లేదు అనే మాట రాలేదు. లొకేషన్స్ కూడా వారే సజెస్ట్ చేశారు. వారి ప్రొడక్షన్‌తో నేను స్క్రిప్ట్ లో అనుకున్న దానికి సినిమాలో రెండింతలు చేశారు. ఈ సినిమా ‘వాల్మీకి’ అనే టైటిల్‌తో మొదలయ్యింది. అందుకే ఈ సినిమా గణ విజయాన్ని ‘వాల్మీకి మహర్షి’కి అంకితం ఇస్తున్నాను’’ అన్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘మా ‘గద్దలకొండ గణేష్’ సైన్మాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమాతో అధర్వ నాకు మరో బ్రదర్ అయ్యారు. ఐనాంక బోస్ విజువల్స్ చాలా బాగున్నాయి. అందుకు ఆయనకు థాంక్స్. అలాగే నేను ఫోన్ చేసి చిన్న క్యామియో ఉంది అనగానే వెంటనే వచ్చి చేసిన హీరో నితిన్ గారికి స్పెషల్ థాంక్స్. అలాగే సినిమాలో నా కుర్తాలు చాలా బాగున్నాయి అంటున్నారు అవి డిజైన్ చేసిన గౌరీ గారికి థాంక్స్. పూజా నా ఫస్ట్ హీరోయిన్. ఆమెతో కలిసి నటించడం చాలా హ్యాపీ. ‘గబ్బర్‌సింగ్’ చూశాక మా బాబాయ్‌కి అంత పెద్ద హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ గారు నాకోసం కథ తీసుకువస్తారు అనుకోలేదు. నేను పర్సనల్‌గా కనెక్ట్ అయిందే ఎక్కడంటే మా ఇద్దరికి సినిమా తప్ప మరేదీ తెలీదు. ఆయన ఏదయినా సినిమా కోసమే చేస్తారు. మా ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట, గోపి ఆచంట నాతో రెండు సంవత్సరాలుగా ట్రావెల్ అవుతున్నారు. ఫుల్ సపోర్ట్ చేసారు. ఈ సినిమాలో హరీష్ రాసిన ‘సినిమా డబ్బు, పేరు ఇస్తుంది అని విన్నా కానీ ఇంత ప్రేమ ఇస్తుంది అనుకోలేదు’ అనే డైలాగ్ విని వెంటనే చిరంజీవిగారికి మెసేజ్ పెట్టాను. మీరు మీ కష్టంతో ఇండస్ట్రీకి వచ్చారు. కానీ మా అందరికీ కూడా బంగారు బాట వేసినందుకు థాంక్స్ అని. ఈ సినిమా రిలీజ్‌కి ముందు టైటిల్ మార్చాలి అన్నప్పుడు చరణ్ అన్నకి ఫోన్ చేశాను. ఇంటికి రా అన్నారు. వెళ్తే చరణ్ అన్న, తారక్ ఇద్దరు కలిసి కూర్చొని కాఫీ తాగుతున్నారు. ఆరోజు నాకున్న స్ట్రెస్‌ని జీరోకి తీసుకువచ్చింది వారిద్దరే. ఈ సందర్భంగా వారిద్దరికీ థాంక్స్. అలాగే ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్‌కి ధన్యవాదాలు’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో నటులు వంశీ చాగంటి, శత్రు, దేవి ప్రసాద్, రచ్చరవి, స్క్రీన్‌ప్లే రైటర్స్ మధు శ్రీనివాస్, చైతన్య, డిస్ట్రిబ్యూటర్స్ శ్రీనివాస్, వెంకట్, వెంకట్ రత్నం, బుజ్జి, డిజైనర్ గౌరి, లైన్ ప్రొడ్యూసర్ హరీష్ కట్టా తదితరులు పాల్గొన్నారు.