ఇదేంటబ్బా.. ఇంతకీ ఈ లక్కీ ఫెలో ఎవరబ్బా..? అని ఆశ్చర్యంగా ఉంది కదూ.. అవును మీరు వింటున్నది నిజమే మెగా హీరో తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇటీవల విడుదలైన ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో మంచి ఫామ్‌లో ఉన్న వరుణ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆయన చేసిన ఈ కామెంట్స్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
పెళ్లికైతే ఎవరు..? ఎఫైర్‌కైతే ఎవరు..? ఎవరిని చంపాలని ఉంది..? అనే ప్రశ్న ఎదురవ్వగా వరుణ్ చాలా లాజిక్‌గా సమాధానమిచ్చాడు. ‘పెళ్లికి అయితే సాయి పల్లవి. డేటింగ్ కోసమైతే పూజా హెగ్డే. రాశీఖన్నాను చంపేస్తా’ అని చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూ చూసిన మెగాభిమానులు వామ్మో.. వరుణ్ కోరికలు మామూలుగా లేవు కదా అని నవ్వుకున్నారట.
కాగా ఈ ముగ్గురితోనూ వరుణ్ నటించాడు. ‘ఫిదా’ సినిమాతో సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేయగా.. ‘ముకుందా’ సినిమాతో యూత్‌ను మంత్రముగ్దులను చేసి.. ‘గద్దలకొండ గణేష్’తో మెగాభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న భామ పూజాహెగ్దే. ఇక రాశీఖన్నా విషయానికొస్తే.. ‘తొలిప్రేమ’ సినిమాలో వరుణ్ సరసన నటించింది.
ఇలా ఈ ముగ్గురితోనూ వరుణ్‌కు మంచి అటాచ్‌మెంట్ ఉంది. మరి వరుణ్ మాటలు రీల్‌కే పరిమితం అవుతాయా..? రియల్ లైఫ్‌లోకి కూడా వస్తాయా అన్నది తెలియాల్సింది. మరి సాయిపల్లవి దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో. అయితే ఇద్దరూ గట్టిగా అనుకుంటే పెళ్లి బాజాలు మాత్రం మోగిపోతాయ్.. పరిస్థితి ఎలా ఉంటుందో..!