Advertisementt

‘అల వైకుంఠపురములో’.. అదిరిన గిరాకీ!

Wed 25th Sep 2019 08:44 PM
ala vaikuntapuramlo movie,overseas rights,blue sky,allu arjun,trivikram srinivas  ‘అల వైకుంఠపురములో’.. అదిరిన గిరాకీ!
Ala Vaikuntapuramlo Movie Overseas Rights Sold out ‘అల వైకుంఠపురములో’.. అదిరిన గిరాకీ!
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ సినిమాలకు ఓవర్సీస్‌లో భారీ గిరాకీ ఉంటుంది. త్రివిక్రమ్ సినిమాలాంటే క్లాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. ఓవర్సీస్ లో త్రివిక్రమ్ సినిమాలకు ఎప్పుడూ అధిక ధరే పలుకుతుంది. త్రివిక్రమ్ సినిమాలంటే ఓవర్సీస్ ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చుని ఎంజాయ్ చేసే సినిమాలను త్రివిక్రమ్ తెరకెక్కిస్తారు. ఇక తాజాగా త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ శరవేగంగా జరగడమే కాదు.. సినిమా బిజినెస్ కూడా మొదలయ్యింది. ఇప్పటికే శాటిలైట్ హక్కులను భారీ ధరకు అమ్మేసిన నిర్మాతలు ఇప్పుడు ఓవర్సీస్ హక్కులను కూడా మంచి రేటుకి అమ్మేసినట్లుగా తెలుస్తుంది.

అల వైకుంఠపురములో ఓవర్సీస్ హక్కులకోసం గట్టి పోటీ నెలకొన్నప్పటికీ.. త్రివిక్రమ్ క్రేజ్ తో బ్లూ స్కై సంస్థ 8.56 కోట్లకి ఈ హక్కులను దక్కించుకున్నట్టు సమాచారం. సంక్రాంతి బరిలో దిగుతున్న అల్లు  అర్జున్ సినిమా మీదకి మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా పోటీకి వస్తున్నప్పటికీ.. త్రివిక్రమ్ క్రేజ్, క్రేజ్ ఉన్న హీరోయిన్స్ నటించడం, అలనాటి హీరోయిన్స్ ఈ సినిమాలో భాగమవడం, అల్లు అర్జున్ స్టామినాతో ఈ సినిమా హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడి... చివరికి 8.56 కోట్లకు బ్లూ స్కై సంస్థ అలా వైకుంఠపురములో హక్కులను ఎగరేసుకుపోయింది. 

Ala Vaikuntapuramlo Movie Overseas Rights Sold out:

Blue Sky bagged Ala Vaikuntapuramlo Movie Overseas Rights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ