మెగాస్టార్ చిరంజీవి అంటే మనకి క్రేజ్ కానీ ఇతర భాషల్లో కాదు. అందుకే సైరా సినిమా బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో తారాస్థాయికి చేరినా.. మిగిలిన భాషల్లో చాలా తక్కువ మొత్తానికి తీసుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ సినిమాను చాలా తక్కువ రేట్ కి కొన్నారు ఎక్సెల్ సంస్థ వారు. మినిమం గ్యారెంటీ పద్ధతిలోనే హిందీ రైట్స్ రామ్ చరణ్ ఇచ్చారట.
హిందీలో ఎంత వస్తుందో చెప్పలేం కాబట్టి అందుకే చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల సినిమాకి వచ్చిన లాభాలు మొత్తం డిస్ట్రిబ్యూటర్‌కి వెళ్లిపోకుండా తనకి యాభై శాతం వాటా వచ్చేలా చూసుకున్నాడు. నిజానికి రామ్ చరణ్ సైరాను హిందీలో సోలోగా రిలీజ్ చేద్దాం అనుకున్నాడు కానీ అతనికి హిందీ మార్కెట్ మీద పట్టు లేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఇక హిందీలో రిలీజ్ చేస్తున్న ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను లైట్‌గా తీసుకోవడం లేదు. అక్కడ ఈ మూవీని ఏకంగా పదిహేను వందల స్క్రీన్లలో విడుదల చేస్తూ తమ క్రెడిబులిటీ చాటుకుంటున్నారు. మరి సైరా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.