Advertisementt

‘సైరా’ ట్రైలర్ 2: ఫ్యాన్స్‌కి పూనకాలే!

Thu 26th Sep 2019 06:14 PM
sye raa trailer 2,sye raa narasimha reddy trailer 2,chiranjeevi,ram charan,surender reddy  ‘సైరా’ ట్రైలర్ 2: ఫ్యాన్స్‌కి పూనకాలే!
Sye Raa Narasimha Reddy Trailer 2 Released ‘సైరా’ ట్రైలర్ 2: ఫ్యాన్స్‌కి పూనకాలే!
Advertisement
Ads by CJ

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రమోషన్స్ మెల్లగా స్టార్ట్ అయ్యాయి. వచ్చే బుధవారమే విడుదల కాబోతున్న సైరా సినిమా ప్రమోషన్స్‌లో వీక్ అయినప్పటికీ... చేసిన ప్రమోషన్స్ గట్టిగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్, బెంగుళూరు, చెన్నై, ముంబైలలో సినిమా ప్రెస్స్ మీట్స్ తో సుడిగాలి ప్రమోషన్స్ కి సైరా టీం రెడీ అయ్యింది. అయితే పలు రాష్ట్రాల్లో వర్షాలు కాదు కాదు భారీ వర్షాలు పడుతుండడంతో కంగారు పడిన సైరా టీం ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి రేపడానికి సోషల్ మీడియాని బాగా యూజ్ చేసుకోవాలనుకుంటుంది. అందులో భాగంగానే సైరా సినిమా రెండో ట్రైలర్‌ని ఈ రోజు ఉదయమే విడుదల చేసింది టీం.

మొదటి ట్రైలర్‌లో సైరా కేరెక్టర్స్ లోని బలాబలాలను చూపిస్తూ అన్ని రకాల మసాలాను దట్టించిన సైరా టీం.. ఈసారి కేవలం యాక్షన్ కే ఇంపార్టెన్స్ ఇచ్చింది. చిరుని హైలెట్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ బ్రిటీష్ దొరల దోపిడీని, అది వ్యతిరేకించిన నరసింహారెడ్డి తెగువను తెలిపేదిగా ఉంది. ఈ ట్రైలర్ మొత్తం బ్రిటిష్ వారి మీద ఎదురు తిరిగిన సైరా నరసింహారెడ్డి ఊపిరి సలపని పోరాటాలతో, చిరంజీవి వీరోచిత నటనతో ఆకట్టుకుంది. అయితే ట్రైలర్ మొత్తం యాక్షన్‌తో నింపేశారు. ట్రైలర్ అయితే మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేదిలాగే ఉంది. బ్యాటిల్ ఫీల్డ్ ట్రైలర్ అని చెప్పి వదిలిన ఈ ట్రైలర్.. చిత్రంలో యుద్ధ సన్నివేశాలు మాములుగా ఉండవనిపించేలా చేయడంలో సక్సెస్ అయినట్లే.

Click Here for Trailer

Sye Raa Narasimha Reddy Trailer 2 Released:

Sye Raa Narasimha Reddy Trailer 2 Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ