వాల్మీకి గత వీకెండ్ లో రిలీజ్ అయింది. మాస్ ఎంటర్ టైనర్ కాబట్టి వీకెండ్ మొత్తం బాగానే ఆడింది. ఇక సోమవారం కూడా బాగానే రన్ అయింది. మంగళవారం కూడా పర్లేదు అనిపించుకుని బ్రేక్ ఈవెన్ అవుతుందని నమ్మకం ఏర్పరిచింది. కానీ బుధవారం ట్రెండ్ చూస్తుంటే. షేర్ వస్తోంది కానీ, ఈ వస్తున్న షేర్ తో బయ్యర్లు అందరూ బ్రేక్ ఈవెన్ అవుతారా? అనుమానాలు వచ్చాయి.
బుధవారం కలెక్షన్స్ బట్టి నైజాంలో ఒకటి రెండు ఏరియాలు బ్రేక్ ఈవెన్ కు దూరంగా వుండే ప్రమాదం కనిపిస్తోంది. ఈవారం సరైన సినిమా లేదు కాబట్టి ఆ మిగిలిన చోట్లు కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశముంది. మొదటివారం ఉన్న జోరు రెండో వారంలో లేదు. ఇలానే గ్యాంగ్ లీడర్ పరిస్థితి కూడా. మొదటివారం అబ్బో అనుకున్నారు కానీ వీకెండ్ ముగిసేసరికి కలెక్షన్స్ డల్ అయింది. కానీ గ్యాంగ్ లీడర్ తో పోల్చుకుంటే వాల్మీకి పర్లేదు చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది.
నిజానికి బ్రేక్ ఈవెన్ అవ్వడం ఇక్కడ పాయింట్ కాదు. వరుణ్ తేజ్ అండ్ హరీష్ ఇద్దరు ఇది బ్లాక్ బస్టర్ కింద లెక్క వేస్తున్నారు. కానీ ట్రేడ్ లెక్కలు ఏమో బ్రేక్ ఈవెన్ కి దగ్గరలో ఉన్నాయి. అందుకే టీం అంతా సక్సెస్ టూర్ లో ఉంది. మరి ఈవారం ఎంతవరకు నెట్టుకొస్తుందో చూడాలి.