టాలీవుడ్‌లో చిన్నపాటి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్దే.. ఇప్పుడు టాప్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలోనే ఓ వెలుగు వెలుగుతోంది. టాలీవుడ్ ఒకట్రెండు తరాల హీరోల సరసన నటించేసిన ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కనీసం సినిమాకు.. సినిమాకు కాస్త కూడా గ్యాప్ లేకుండా అవకాశాలు వచ్చేస్తున్నాయి. నిన్నగాక మొన్న ‘అరవింద సమేత’.. ఆ తర్వాత ‘మహర్షి’.. అనంతరం ‘వాల్మీకి’ ఇప్పుడు ప్రభాస్, అల్లు అర్జున్, అఖిల్ సరసన నటించబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పైన ఎన్టీఆర్, మహేశ్, వరుణ్ తేజ్ సరసన నటించిన తర్వాత పూజా సుడి తిరిగిందని చెప్పుకోవాలి. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనుకునే దర్శకనిర్మాతలంతా ఫస్ట్ పూజా వైపే చూస్తున్నారు.
ఇలా ఒక సినిమా రిలీజ్ కాకమునుపే మరో సినిమాకు అవకాశాలు వచ్చేస్తుండటంతో తనకు భారీగా డిమాండ్ ఉందని గ్రహించిన ఈ ముద్దుగుమ్మ పారితోషికం గట్టిగానే పేంచేసిందట. అంటే.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను పూజా పక్కాగా ఫాలో అవుతోందన్న మాట. ప్రస్తుతానికి రూ. 2 కోట్ల వరకు డిమాండ్ పూజా డిమాండ్ చేస్తోందట. ఇప్పటికి టాలీవుడ్ కుర్ర స్టార్ హీరోలతో నటించేసిన ఈ ముద్దుగుమ్మ త్వరలో ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలు గానీ హిట్టయితే మాత్రం ఆ రెండు కోట్ల రూపాయిలు కాస్త.. నాలుగు కోట్లు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో మరి.