Advertisementt

కామెడీ సినిమాలో విజయశాంతి.. గ్రీన్ సిగ్నల్!

Fri 27th Sep 2019 12:29 PM
vijayashanthi,ramulamma,comedy movie,f3,anil ravipudi  కామెడీ సినిమాలో విజయశాంతి.. గ్రీన్ సిగ్నల్!
Vijayashanthi Acts In Comedy Movie Soon!! కామెడీ సినిమాలో విజయశాంతి.. గ్రీన్ సిగ్నల్!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన లేడీ సూపర్ స్టార్, నేటి పొలిటీషియన్ విజయశాంతి అలియాస్ రాములమ్మ దాదాపు పదమూడేళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ సీనియర్ నటి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే షూటింగ్‌లో విజయశాంతి నటన చూసి ఫిదా అయిపోయిన అనీల్ రావిపూడి తన తదుపరి చిత్రంలో ఓ మంచి పాత్రలో తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. ఈ విషయాన్ని రాములమ్మ దృష్టికి తీసుకెళ్లగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇప్పటికే షూటింగ్‌లో ఓ రోజు పాత్ర గురించి విజయశాంతికి వివరించగా బాగుందని కితాబిచ్చిందట.

కాగా.. ‘ఎఫ్-2’ సినిమా అనీల్ రావిపూడి కెరియల్‌లో గుర్తుండిపోయేలా సూపర్ డూపర్ హిట్టయిపోయింది. అయితే దీనికి సీక్వెల్‌గా ‘ఎఫ్-3’ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలోనే ఓ కీలక పాత్రలో రాములమ్మ నటించమని కోరాడట. అయితే ఎఫ్‌-2 సినిమాలో దాదాపు అన్నీ కామెడీ పాత్రలో ఉన్నాయ్.. మరి ఎఫ్-3లో కామెడీ పాత్రలుంటేనే సక్సెస్ అవుతుంది.. ఉండాలి కూడా.!. మరి రాములమ్మ కోసం కూడా కామెడీ పాత్రనే అనీల్ రెడీ చేశాడా..? లేకుంటే మరో పాత్ర ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాలంటే ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే మరి.

Vijayashanthi Acts In Comedy Movie Soon!!:

Vijayashanthi Acts In Comedy Movie Soon!!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ