Advertisementt

శరవేగంగా ఐరా క్రియేషన్స్ నాగశౌర్య మూవీ!

Fri 27th Sep 2019 08:06 PM
naga shourya,ira creations,movie,shooting,hyderabad  శరవేగంగా ఐరా క్రియేషన్స్ నాగశౌర్య మూవీ!
Naga Shourya Movie Latest Update శరవేగంగా ఐరా క్రియేషన్స్ నాగశౌర్య మూవీ!
Advertisement
Ads by CJ

శరవేగంగా ఐరా క్రియేషన్స్ - నాగశౌర్య ప్రొడ‌క్ష‌న్ నెం 3 షూటింగ్ - ముగిసిన వైజాగ్ షెడ్యూల్, అక్టోబర్ నుంచి హైదరాబాద్ షెడ్యూల్ 

యూత్ హీరో నాగశౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రిన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకంపై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌లుగా ప్రొడ‌క్ష‌న్ నెం 3 రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ఈ సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. అటు క్లాస్ ఇటు మాస్ ఆడియెన్స్ ని అల‌రించాల‌నే ఉద్దేశంతో ఈ సినిమాలో కాస్త ఎక్కువగానే యాక్ష‌న్ స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్న‌ట్లుగా యూనిట్ స‌భ్యులు చెబుతున్నారు. ప్యాన్ ఇండియా హిట్ గా నిలిచిన కేజీఎఫ్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్ట‌ర్స్ తెలుగులో మొద‌టిసారిగా నాగ‌శౌర్య సినిమాకి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేస్తుండ‌టం విశేషం. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌లే వైజాగ్ లో ఈ సినిమాకి సంబంధించిన ఓ యాక్ష‌న్ సీన్ ని షూట్ చేస్తుండ‌గా నాగ‌శౌర్య కాలికి గాయ‌మైన సంగ‌తి తెలిసిందే. దీంతో కొంత బ్రేక్ తీసుకోని  నాగ‌శౌర్య మ‌ళ్లీ షూట్ లోకి జాయిన్ అవ్వ‌డం జ‌రిగింది. తాజాగా వైజాగ్ లో అన్బుఅరివు మాస్ట‌ర్స్ కంపోజ్ చేసిన కొన్ని పోరాట సన్నివేశాలు షూటింగ్ పూర్తి చేసుకున్న యూనిట్ అక్టోబర్ నుంచి మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇక అన్బుఅరివు మాస్ట‌ర్స్ కు తెలుగులో ఇది మొద‌టి సినిమా కావ‌డంతో, యాక్ష‌న్ సన్నివేశాల్ని చాలా అద్భుతంగా కంపోజ్ చేస్తున్నార‌ని ద‌ర్శ‌కనిర్మాత‌లు చెబుతున్నారు. ఇక అలానే ఈ సినిమాలో క‌ట్ లేకుండా ఉండే 3 నిమిషాల నిడివిగ‌ల స‌న్నివేశాల్ని కూడా చిత్రీక‌రిస్తున్నామ‌ని, ఇవి ప్రేక్ష‌కుల‌కి ఓ స‌రికొత్త అనుభూతిని ఇస్తాయ‌ని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు

న‌టీన‌టులు.. 

పోసానికృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, ప్రొయ‌ర‌మ‌ణ‌, వి.జ‌య‌ప్రకాష్‌, కిషోర్‌, ఎం.ఎస్‌. భాస్క‌ర్ 

Naga Shourya Movie Latest Update :

Naga Shourya and Ira Creations Movie Shooting in Hyderabad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ