ఈనెలలో విడుదలైన గ్యాంగ్ లీడర్ మిక్స్డ్ టాక్ తో బ్రేక్ ఈవెన్ సాధించలేక చతికిల పడింది. ఇక ఈ నెల 20 న విడుదలైన సూర్య బందోబస్త్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా... వరుణ్ తేజ్ వాల్మీకి మిక్స్డ్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. వారాంతంలో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల పడుతుందో.. లేదో.. అనేది తేలిపోతుంది. ఇక ఈ వారం విడుదలయ్యే సినిమాల్లో ఏ మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ లేని సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అక్టోబర్ 2 న విడుదలకాబోతున్న సైరా నరసింహారెడ్డికి ఎదురు నిలిచే ఆలోచన ఎప్పుడో మీడియం బడ్జెట్ సినిమాలు విరమించుకున్నాయి.
ఇక చిన్నా చితక సినిమాలు నాలుగైదు సినిమాలు ఈరోజు విడుదలకాబోతున్నాయి. అందులో చాలా టైటిల్స్ కనీసం ప్రేక్షకులకు ఏమాత్రం అవగాహన లేవు. ఇక కొన్ని సినిమాల్లో హీరో, హీరోయిన్ ఎవరో కూడా తెలియదు. అసలా సినిమాలెప్పుడు తెరకెక్కాయో కూడా అర్ధం కావు. ఈ వారం రాబోతున్న చిన్న చిన్న సినిమాలేవంటే... రామ చక్కని సీత, నిన్ను తలచి, రాయలసీమ లవ్ స్టోరీ, మిర్రర్, బీజే సినిమాలు ఈ వారం బాక్సాఫీసు బరిలో నిలవబోతున్నాయి. మరి చిరు సైరాకి ఎదురెళ్ళే దమ్ములేక చాలా సినిమాలు ఈ వారం విడుదలకు రావడం లేదు. సైరా వచ్చేవరకు ఈ ఐదు రోజులు కూడా వాల్మీకి దే హవా.