Advertisementt

రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘సామజవరగమన’!

Mon 30th Sep 2019 09:17 PM
ala vaikunthapurramuloo,samajavaragamana song,allu arjun  రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘సామజవరగమన’!
Ala Vaikunthapurramuloo movie song Record Views రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘సామజవరగమన’!
Advertisement
Ads by CJ

‘అల వైకుంఠపురంలో’ ఫస్ట్ సింగల్ ‘సామజవరగమన’కు 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ని మొదటిపాట ‘సామజవరగమన’ విడుదల అయిన విషయం విదితమే.  ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ గీతానికి తమన్ స్వరాలు సమ్మోహన పరుస్తున్నాయి. గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ప్రస్తుతం విశేష ఆదరణకు నోచుకుంటోంది. ఈ పాట విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్, 313కె లైక్స్ రావడం విశేషం. తెలుగులో మొదటిసారి ఫస్ట్ సింగల్ కు ఇన్ని వ్యూస్, లైక్స్ రావడం హర్షించదగ్గ విషయం. సామజవరగమన సాంగ్ విడుదలైన మొదటి 35 నిమిషాల్లో 50 వేల లైక్స్, 88 నిమిషాలకు 1 లక్ష లైక్స్, మూడు గంటల 7 నిమిషాలకు లక్ష 50 వేల లైక్స్, 6 గంటల 12 నిమిషాలకు 2 లక్షల లైక్స్, 10 గంటల 22 నిమిషాలకు 2 లక్షల 50 వేల లైక్స్, 22 గంటల 5 నిమిషాలకు 3 లక్షల లైక్స్ రావడం విశేషం.

‘అల వైకుంఠపురములో’ని తారలు:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీరావు, కల్యాణి నటరాజన్, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు: డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి:  ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్, నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

Ala Vaikunthapurramuloo movie song Record Views:

Ala Vaikunthapurramuloo Movie song creates Records

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ