నెల గ్యాప్ లో బాలీవుడ్ లో ఐదు చిత్రాలు రిలీజ్ అయ్యి అన్ని హిట్స్ అందుకున్నాయి. ఆగస్టు 15 నుండి నాలుగు వారాలలో ప్రతి శుక్రవారం ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘మిషన్ మంగళ్’, ‘బట్ల హౌస్’, ‘సాహో’, ‘చ్ఛిచ్చోరె’ అండ్ ‘డ్రీం గర్ల్’. అయితే ఈ ఐదు సినిమాలు దాదాపు 700 కోట్లు వసూళ్లు చేసాయి.
మొదట ఆగస్టు 15 న ‘మిషన్ మంగళ్’ రిలీజ్ అయితే ఆగస్టు చివరి వారంలో ప్రభాస్ నటించిన సాహో చిత్రం దుమ్ము లేపింది. ఇక అదే రోజు కామెడీ ఎంటర్ టైనర్ చ్ఛిచ్చోరె రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి వసూళ్లు పంట కురిపించాయి. ఇక ఈనెల సెప్టెంబర్ 6 న డ్రీం గర్ల్ చిత్రం వచ్చి 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిపోయింది.
మిషన్ మంగళ్ 200 కోట్లు మార్క్ ని చేరితే బట్ల హౌస్ 100 కోట్లు క్లబ్ లో చేరింది. సాహో 50 కోట్లు, చ్ఛిచ్చోరె ఇంకా థియేటర్స్ లో ఉండడంతో ఈమూవీ 150 కోట్లు మార్క్ ని చేరుకుంటుందని ట్రేడ్ అంచనాలు వేస్తుంది. ఇలా దగ్గరదగ్గర 5 సినిమాలు 700 కోట్లు కలెక్ట్ చేశాయని అంచనాలు వేస్తున్నారు.