Advertisementt

ఇంటర్వ్యూ: మేఘా చౌదరి (ఊరంతా అనుకుంటున్నారు)

Wed 02nd Oct 2019 10:26 AM
megha chowdary,oorantha anukuntunnaru,interview  ఇంటర్వ్యూ: మేఘా చౌదరి (ఊరంతా అనుకుంటున్నారు)
Megha Chowdary Interview about Oorantha Anukuntunnaru ఇంటర్వ్యూ: మేఘా చౌదరి (ఊరంతా అనుకుంటున్నారు)
Advertisement
Ads by CJ

ఊరంతా అనుకుంటున్నారు ఫేమ్ మేఘా చౌదరి ఇంటర్వ్యూ..

1. ఈ సినిమాలో మీ కారెక్టర్ ఎలా ఉండబోతుంది..?

ఇందులో నా కారెక్టర్ పేరు ఘాడీ.. పక్కింటి అమ్మాయి తరహా పాత్ర ఇది. చాలా సంప్రదాయ బద్ధంగా ఉంటుంది ఘాడీ పాత్ర. ఇండిపెండెంట్ భావాలుండే అమ్మాయి పాత్ర. ప్రతీ అమ్మాయికి ఈ పాత్ర కనెక్ట్ అవుతుంది. ఓ వైపు కుటుంబాన్ని.. మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్‌ను సరిగ్గా బ్యాలెన్స్ చేసుకునే అమ్మాయి పాత్ర. ఇక్కడి వరకు నా పాత్ర.. మిగిలింది సినిమాలో చూడండి..

2. నవీన్ విజయ్ కృష్ణతో నటించడం ఎలా అనిపించింది..?

నవీన్ మంచి హ్యూమన్ బీయింగ్.. ఎడిటర్‌గా తన కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు నటుడిగా మారడం అద్భుతమైన విషయం. ఆయనలో మంచి యాక్టర్ ఉన్నాడు. నేను హైదరాబాద్‌కు వచ్చినపుడు హైదరాబాద్‌లో ఎవరూ తెలియదు. 2017 డిసెంబర్ 31న ఇంకో సినిమా కోసం నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడు ఊరంతా స్క్రిప్ట్ విన్నాను. ఆ తర్వాత టీంతో కలిసాక నవీన్ మంచి ఫ్రెండ్ అయిపోయాడు. అప్పటి వరకు నాకు ఇక్కడ నో ఫ్రెండ్స్.. కానీ ఒక్కసారి నవీన్ అండ్ టీంతో కలిసిన తర్వాత ఆ లోటు కనిపించలేదు నాకు. 2017లో అప్పుడు నేను సైన్ చేసిన సినిమా నిర్మాత, దర్శకులు నన్ను బయటికి తీసుకెళ్లి పార్టీ ఇచ్చారు. అప్పుడే అనిపించింది నాకు.. హైదరాబాద్‌లో అంతా ఓ ఫ్యామిలీలా ఉంటారని. ఆ తర్వాత నవీన్ టీంతో పరిచయం అయింది. అప్పట్నుంచి వాళ్ల సపోర్ట్ నాకు ఉంది. షూటింగ్‌లో అప్పుడప్పుడూ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను అరుస్తుంటాను కానీ నవీన్ మాత్రం చాలా కామ్ అండ్ కూల్. ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా చాలా సైలెంట్‌గా ఉంటాడు. అది ఆయన నుంచి నేను నేర్చుకున్నా. ఏదైనా మనం అనుకున్న పని ప్లాన్ ప్రకారం జరక్కపోయినా కూడా ఏ మాత్రం టెన్షన్ పడడు.

3. మీరు ఎక్కడ్నుంచి వచ్చారు.. మీ గురించి చెప్పండి..?

నేను పుట్టింది కోల్‌కత్తాలో. రసగుల్లాస్ సిటీ నుంచి వచ్చాను. అక్కడే పుట్టి పెరిగాను. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాను. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడే నటించడం మొదలు పెట్టాను. నా మెంటర్ రితూ పర్ణు ఘోష్ గారూ. ఆ తర్వాత బాంబే వెళ్లి నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గానే కాకుండా కాస్టింగ్ అసిస్టెంట్‌గా కూడా పనిచేసాను. ఇప్పుడు తెలుగు, తమిళ్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను.

4. ఏయే సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసారు..?

మిలన్ లూథ్రియా దర్శకత్వంలో శ్రద్ధా కపూర్ నటించిన హసీనా పార్కర్ సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసాను. ఆ తర్వాత ఎమ్మెస్ ధోనీ బయోపిక్‌కు కాస్టింగ్ అసిస్టెంట్‌గా కూడా వర్క్ చేసాను. నటిగా నా తొలి సినిమా బెంగాలీలో వచ్చిన అమర్ ప్రేమ్.. ఎరోస్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించారు. 2016లో ఈ సినిమా విడుదలైంది. ఇక తెలుగులో రెండు వారాల కింద విడుదలైన మార్షల్ నా తొలిసినిమా. ఇప్పుడు ఊరంతా అనుకుంటున్నారు సినిమాతో మీ ముందుకు వస్తున్నాను.

5. ఈ సినిమా ఎలా ఉండబోతుంది..?

ఊరంతా అనుకుంటున్నారు పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇందులో ప్రతీ పాత్ర మన కుటుంబంలో ఉన్నట్లే ఉంటుంది. రోజూ మన కుటుంబంలో ఉన్న పాత్రలే సినిమాలో కూడా కనిపిస్తాయి. ప్రతీ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ముఖ్యంగా జయసుధ, రావు రమేష్, కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. అందరి పాత్రలు సినిమాలో చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతీ ఇంట్లో ఉన్నట్లే ఈ కారెక్టర్స్ ఉంటాయి. అంతా ఎంత సీనియర్స్ అయినా కూడా ఒక్కసారి సెట్‌కు వచ్చిన తర్వాత అంతా కలిసిపోతారు. ఈ సినిమాను కేవలం కథ కోసమే ఒప్పుకున్నాను. ఇందులో హీరో 50 సీన్స్ చేస్తే.. అందులో నావి కూడా 50 సీన్స్ ఉంటాయి. రెండు కథలు ప్యారలల్‌గా వెళ్తుంటాయి. కేయం రాధాకృష్ణన్ గారి పాటలు కూడా చాలా బాగున్నాయి. కన్నా అనే పాట నాకు బాగా నచ్చింది. రాశీఖన్నా ఈ పాటను పాడారు. దసరాకు హ్యాపీగా కుటుంబంతో వెళ్లి చూడదగ్గ సినిమా ఇది.

6. మార్షల్ మెడికల్ థ్రిల్లర్.. ఇది ఫ్యామిలీ.. మీ పాత్రకు రెండింట్లో తేడాలేంటి..?

మార్షల్ సినిమాకు దీనికి చాలా తేడాలున్నాయి. అందులో మేఘా అనే యంగ్ జర్నలిస్ట్ పాత్రలో నటించాను. పూర్తిగా అది గ్లామరస్ పాత్ర. ఏది అనిపిస్తే అది ధైర్యంగా చెప్పగలిగే బోల్డ్ క్యారెక్టర్ అది. కానీ ఊరంతా అనుకుంటున్నారు సినిమాలో అలా కాదు. పక్కా తెలుగమ్మాయి పాత్ర. చాలా పద్దతిగా ఉంటుంది. ఘాడీ కుటుంబానికి బాగా విలువ ఇచ్చే అమ్మాయి పాత్ర. తప్పులున్నా కూడా ధైర్యంగా చెప్పలేదు.. కుటుంబం కోసం అన్నీ భరిస్తుంటుంది. ఏం చేసినా కూడా కుటుంబం కోసమే అన్నట్లు ఉంటుంది. నటనకు కూడా స్కోప్ ఉన్న పాత్ర ఇది. శ్రీనివాస్ అవసరాల కూడా ఈ చిత్రంలో ఉన్నారు. ఆయన అద్భుతమైన దర్శకుడే కాదు.. మంచి నటుడు కూడా. భాషలో సమస్యలు వచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేసారు.

Megha Chowdary Interview about Oorantha Anukuntunnaru:

Megha Chowdary Talks About Oorantha Anukuntunnaru

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ