Advertisementt

‘సైరా’, ‘వార్’లను బీట్ చేసిన ‘జోకర్’

Sat 05th Oct 2019 02:39 PM
joker,beats,sye raa,war,chennai,collections  ‘సైరా’, ‘వార్’లను బీట్ చేసిన ‘జోకర్’
Joker beats Sye Raa and War at Chennai ‘సైరా’, ‘వార్’లను బీట్ చేసిన ‘జోకర్’
Advertisement
Ads by CJ

గాంధీ జయంతి నాడు ఇండియాలో మూడు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. తెలుగు నుండి సైరా, హిందీ నుండి మల్టీ స్టారర్ మూవీ వార్, హాలీవుడ్ నుండి జోకర్ ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ మూడు చిత్రాలు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. మూడింటికి మూడు పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో వీటి మధ్య పోటీ రసవత్తరంగా మారింది.

చెన్నై సిటీలో దేశీయ సినిమాలైన సైరా, వార్ ల కంటే జోకర్ మూవీ ఎక్కువ వసూళ్లు సాధించి ఝలక్ ఇచ్చింది. జోకర్ చిత్రం చెన్నై సిటీలో 19లక్షల వసూళ్లు సాధించగా, సైరా మరియు వార్ చిత్రాలు సరిసమానంగా 14లక్షల వసూళ్లు రాబట్టాయని సమాచారం.

హాలీవుడ్ లో రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేసిన జోకర్ చిత్రం వరల్డ్ వైడ్ గా మొదటిరోజు 5.4 మిలియన్ వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జోకర్ పాత్రలో నటించిన ఫీనిక్స్ నటన గురించి మాట్లాడుకుంటున్నారు.

Joker beats Sye Raa and War at Chennai:

Superb Collections to Joker Movie at Chennai

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ