Advertisementt

లక్ష్మికి ఇచ్చారు.. సిద్ధమ్మకేది కానుక..!!

Sun 06th Oct 2019 02:06 PM
tamannah,ram charan,costly gift,sye raa movie,upasana,social media  లక్ష్మికి ఇచ్చారు.. సిద్ధమ్మకేది కానుక..!!
Upasana’s Costly Gift to Tamannah లక్ష్మికి ఇచ్చారు.. సిద్ధమ్మకేది కానుక..!!
Advertisement
Ads by CJ

సైరా నరసింహారెడ్డికి ప్రియురాలి లక్ష్మి పాత్రలో తమన్నా, భార్య సిద్ధమా పాత్రలో నయనతార నటించారు. మెయిన్ హీరోయిన్ నయనతార కన్నా ఎక్కువగా తమన్నానే హైలెట్ అవడం, సై రా సినిమా ప్రమోషన్స్ లో నయన్ రాకుండా తమన్నానే హైలెట్ అవడం, సై రా సినిమా విడుదలయ్యాక నయన్ కన్నా ఎక్కువగా తమన్నాకి పేరు రావడంతో... ఒక్కసారిగా తమన్నా పాపులర్ అయ్యింది. నిన్నమొన్నటివరకు ఔటెడ్ హీరోయిన్ అనుకుంటే... ఇప్పుడు సై రా సినిమాతో పేరుకు పేరు, అవకాశాలకు అవకాశాలు వచ్చేలా ఉన్నాయి. నరసింహారెడ్డిని ఆరాధించే లక్ష్మి పాత్రలో తమన్నా నటనకు అందరూ ఫిదా అవుతున్నారు.

ఇక నయన్ ఫస్ట్ హీరోయిన్ అనే సంగతి కూడా అందరూ మర్చిపోయేలా చేసింది తమన్నా. అయితే తమన్నా ప్రమోషన్స్ కి రావడం, సై రాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో బాగా కష్టపడిన తమన్నాకి సై రా నిర్మాత రామ్ చరణ్ మంచి గిఫ్టు ఇచ్చాడట. ఆ విషయాన్నీ చరణ్ వైఫ్ ఉపాసన ట్వీట్ చేసింది. మిస్టర్ నిర్మాత (చరణ్) తమన్నాకి మంచి గిఫ్టు ఇచ్చారు అని చెప్పిన ఉపాసన తమన్నాని మిస్ అవుతున్నట్టుగా ట్వీట్ చేసింది. దానికి రిప్లై గా తమన్నా తన చేతి వేలుకి పెట్టుకున్న క్రిస్టల్ రింగ్ ని చూపిస్తూ.... నేను మిమ్మల్ని కలవడానికి తెగ వెయిట్ చేస్తున్నట్టుగా చెప్పింది. మరి నయన్ ని లైట్ తీసుకుని.. తమన్నాకి ఇలా గిఫ్టు ఇవ్వడం చూస్తే నయన్ కి కాలుతుందేమో.

 

Upasana’s Costly Gift to Tamannah:

Costly Gift to Tamannah.. But no to Nayanathara

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ