విశ్వ నటచక్రవర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని.. పద్మభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. 6 అక్టోబర్ 2019 (ఆదివారం) ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో తాడేపల్లిగూడెం యస్.వి.ఆర్.సర్కిల్, కె.యన్.రోడ్ లో విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ‘సైరా నరసింహారెడ్డి’ ఘనవిజయం నేపథ్యంలో ప్రచారకార్యక్రమాల బిజీలోనూ మెగాస్టార్ ఇచ్చిన మాటకు కట్టుబడి విగ్రహావిష్కరణకు విచ్చేస్తున్నందుకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరు షెడ్యూల్ ఈ విధంగా సాగనుంది.
ప.గో...జిల్లా తాడేపల్లిగూడెంలోఈ రోజు పర్యటించనున్న మెగాస్టార్ చిరంజీవి
తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన 9అడుగుల 3అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని అవిష్కరించనున్న చిరు
ఉదయం 9.00 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న చిరంజీవి
గన్నవరం విమానాశ్రయంలో చిరంజీవికి ఘన స్వాగతం పలుకనున్న వివిధ పార్టీల నేతలు, అభిమానులు
గన్నవరం విమానాశ్రయం నుంచి సుమారు 250 కార్లకు పైగా భారీ ర్యాలీతో రోడ్డు మార్గంలో రానున్న చిరు
మార్గమధ్యంలో అక్కడక్కడా అవసరం మేరకు రోడ్ షో నిర్వహించనున్న మెగాస్టార్
10.30 నుంచి 11.00 గంటల మధ్యలో తాడేపల్లిగూడెం చేరుకోనున్న చిరు
ఎస్వీ రంగారావు విగ్రహాం ఆవిష్కరించి ఆ పక్కనే ఏర్పటుచేసిన సభావేదికపై ప్రసంగించనున్న చిరంజీవి
సుమారు 45 నిముషాలకు పైగా సాగనున్న చిరు ప్రసంగం
12.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 లోగా పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం కానున్న చిరు
120 మంది పోలీసు సిబ్బందితో చిరుకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు బలగాలు
చిరంజీవికి మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేస్తున్న ఉంగుటూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు వట్టి వసంత్, ఈలి నానిలు
విగ్రహావిష్కరణ నుంచి సభాస్థలి వద్ద అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నేతలు వడ్డి రఘురామ్, అఖిల భారత చిరంజీవి అధ్యక్షులు రవణం స్వామినాయుడు, భోగిరెడ్డి రాము, సోమలంక శేషు, మారిశెట్టి అజయ్, బండి రామస్వామి తదితరులు.