Advertisementt

నిర్మాణ రంగంలోకి.. డిస్ట్రిబ్యూటర్..!!

Wed 09th Oct 2019 07:39 PM
distributor,adepu srinivas,turns,producer  నిర్మాణ రంగంలోకి.. డిస్ట్రిబ్యూటర్..!!
Top Distributor Enters Production Field నిర్మాణ రంగంలోకి.. డిస్ట్రిబ్యూటర్..!!
Advertisement
Ads by CJ

నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్న  కార్తికేయ ఎగ్జిబ్యూటర్స్ అధినేత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఆడెపు శ్రీనివాస్

సినిమా కలల ప్రపంచంలో తనబాటను తానే వేసుకున్న కార్తికేయ ఎగ్జిబ్యూటర్స్ అథినేత ఆడెపు శ్రీనివాస్ ‘ఇస్మార్ట్ శంకర్’, ‘హుషారు’, ‘గద్దలకొండ గణేష్’ చిత్రాలతో సక్సెస్ పుల్ ఎగ్జిబ్యూటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీలో మన్ననలు పొందారు. ఇప్పుడు నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. తొలిచిత్రంగా మాస్ హీరో విశాల్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన భారీ చిత్రం ‘యాక్షన్’ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ : ‘‘డిస్ట్రిబ్యూటర్ గా ఇస్మార్ట్ శంకర్, హుషారు, గద్దలకొండ గణేష్ నాకు మంచి విజయాన్ని అందించాయి. మాస్ హీరో విశాల్ చేస్తున్న యాక్షన్ తో నిర్మాతగా మారుతున్నాను. దీనితో పాటు ‘ఎరుపు - పసుపు- పచ్చ’ వంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నాము. ఇప్పుడు రాజుగారి గది -3, అక్షర సినిమాలను కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. త్వరలో నిర్మాణ రంగంలో అడుగు పెడుతున్నాను. విజయదశమి రోజున ఈ విషయాలను మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.

Top Distributor Enters Production Field:

Distributor Adepu Srinivas Turns Producer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ