Advertisementt

‘డిస్కో రాజా’ మొదటి పాటకు టైమ్ వచ్చేసింది

Wed 09th Oct 2019 08:52 PM
disco raja,raviteja,first song,vi anand,disco raja movie  ‘డిస్కో రాజా’ మొదటి పాటకు టైమ్ వచ్చేసింది
Date Fix to Disco Raja Movie First Song Release ‘డిస్కో రాజా’ మొదటి పాటకు టైమ్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

మాస్ మహారాజ రవితేజ మరోసారి తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు, రవితేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్  వి ఐ ఆనంద్ దర్సకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ డిస్కోరాజా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా విడుదల చేసిన డిస్కోరాజా ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19న డిస్కోరాజా మ్యూజిక్ ఆల్బమ్ నుంచి మొదటి పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలానే ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

డిస్కోరాజాకి గ్రాఫిక్స్ హంగులు  

డిస్కోరాజాను ఓ విజువల్ వండర్ గా రెడీ చేసేందుకు గ్రాఫిక్స్ కి పెద్దపీట వేసి నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్, ఆబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పనితనం, నవీన్ నూలి ఎడిట్ ఈ సినిమాకు ఎంతో ప్లస్ అవుతున్నాయి. ఇక వెన్నెల కిషోర్ హిలేరియస్  కామెడీతో ప్రేక్షకులకు నవ్వుల విందు పంచనున్నాడు. బాబీ సింహా ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. టైటిల్ కు తగ్గట్టుగా డిస్కోరాజా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయబోతుంది.

న‌టీన‌టులు 

ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం 

బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్

ప్రొడక్షన్ - రామ్ తళ్లూరి

సమర్పణ - సాయి రిషిక

నిర్మాత : రజిని త‌ళ్లూరి

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : విఐ ఆనంద్

సినిమాటోగ్రాఫ‌ర్  : కార్తీక్ ఘట్టమనేని

డైలాగ్స్ : అబ్బూరి రవి

మ్యూజిక్ : థ‌మన్. ఎస్

ఎడిట‌ర్ : న‌వీన్ నూలి

ఆర్ట్ డైరెక్టర్ : నాగేంద్ర. టి

కో డైరెక్టర్స్ : విజయ్ కామిశెట్టి, సురేష్ పరుచూరి

పిఆర్ఓ : ఏలూరు శ్రీను

Date Fix to Disco Raja Movie First Song Release:

Disco Raja Movie First Song Release on Oct 19

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ