Advertisementt

ట్రెండ్ అవుతున్న RRR టైటిల్ పోస్టర్ నిజమేనా?

Thu 10th Oct 2019 02:24 PM
rrr title poster,net,rajamouli,rama roudra rushitham,ram charan,ntr  ట్రెండ్ అవుతున్న RRR టైటిల్ పోస్టర్ నిజమేనా?
RRR Title Poster: Official or Unofficial? ట్రెండ్ అవుతున్న RRR టైటిల్ పోస్టర్ నిజమేనా?
Advertisement
Ads by CJ

దసరా పండగ నాడు తమ సినిమాల టైటిల్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ లుక్ టీజర్స్ ను రిలీజ్ చేసారు. అలానే ఎటువంటి అధికార ప్రకటన లేకుండా ఆర్-ఆర్-ఆర్ యూనిట్ నుంచి కూడా టైటిల్ పోస్టర్ వచ్చింది. రామ రౌద్ర రుషితం అనే టైటిల్ తో ఒక పోస్టర్ ని సైలెంట్ గా రిలీజ్ చేసారు. కానీ అది ఒరిజినల్ పోస్టర్ కాదు.. ఫ్యాన్ మేడ్ పోస్టర్.

అచ్చం ఒరిజినల్ పోస్టర్ లా ఉండే ఈ పోస్టర్ నిజమే అనుకుని చాలామంది షేర్స్ చేసారు. అంతేకాదు ఇండస్ట్రీలో కొంతమంది పీఆర్ఓలు కూడా షేర్ చేయడంతో అది అనుకుని అంతా షేర్లు, లైకులు కొట్టడం స్టార్ట్ చేశారు. అలా ఆ పోస్టర్ వైరల్ అయింది. అంతే తప్ప అదే నిజమైన టైటిల్ కాదు. రాజమౌళి ఆల్రెడీ RRR కి ఫుల్ ఫామ్ ఏమి ఉండదు అని RRR తోనే వెళ్ళిపోతాం అని ఆమధ్య ప్రకటించాడు.

కాకపోతే ఆర్-ఆర్-ఆర్ సినిమాకు రామ రౌద్ర రుషితం అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ పై ఇంతవరకు ఎటువంటి న్యూస్ లేకపోవడంతో అంత ఇదే టైటిల్ అనుకుంటున్నారు.

RRR Title Poster: Official or Unofficial?:

RRR Title Poster on Net

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ